కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దేశంలో ఉండాలంటే భారత మాతాకి జై చెప్పాల్సిందేనని తెలిపారు.
భారత మాతాకి జై తో పాటు వందేమాతరం అని చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి కైలాశ్ చౌదరి అన్నారు.ఈ క్రమంలోనే భారతమాతాకి జై అనని వారు దేశం వదిలి వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు.
అదేవిధంగా హైదరాబాద్ లోని నవాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం కేంద్రం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చర్చనీయాంశంగా మారాయని సమాచారం.