కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు.దీంతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.
అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.డీహైడ్రేషన్ కారణంగా నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికార వర్గాలు వెల్లడించాయి.







