ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు.. అసలు నమ్మలేరు..

శీతాకాలంలో ఉసిరికాయలు విరివిగా లభ్యం అవుతుంటాయి.ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఒక ఉసిరికాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 Unexpected Health Benefits Of Eating An Amla Every Day Unbelievable , Amla, Wint-TeluguStop.com

ఉసిరి సీజన్ కానప్పుడు ఉసిరిముక్కలను నిలువ చేసి కూడా తినడం మంచిదే.ఉసిరిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.

ఉసిరిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు.సి విటమిన్ సమృద్ధిగా ఉండే ఉసిరికాయ శీతాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది.

ఒక ఉసిరికాయ రెండు నారింజ పండ్లతో సమానం అవుతుంది.

కొంచెం వగరు పులుపు కలయికతో ఉసిరికాయ రుచి ఉంటుంది.ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన విటమిన్ సి లోపంతో బాధపడేవారు దీన్ని ప్రతి రోజు తినడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే ఉసిరిని ప్రతి రోజు తినడం వల్ల రక్తంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది.ఉసిరిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ప్రేగు కదిలికలను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

ఉసిరి నీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి.అంతేకాకుండా ఎముకలు బలంగా కూడా ఉండేలాగా చేస్తుంది.మహిళలలో మెనోపాజ్ సమస్యలను కూడా ఉసిరి తగ్గిస్తుంది.మధుమొహం సమస్య ఉన్నవారు ఉసిరిని రెగ్యులర్గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక గ్లాస్ నీటిలో ఉసిరి పొడి సరిపడ పంచదార కలిపి తాగితే గ్యాస్ సమస్య దూరమైపోతుంది.శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలను రాకుండా చేస్తుంది.

శరీర జీవక్రియ రేటును పెంచి కొవ్వు పదార్థాల వినియోగాన్ని తగ్గిస్తుంది.అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube