ఆది నుంచి ఆశలు పెట్టుకున్న పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ భారీ పరాభవం ఎదురైంది.అయితే ఇది ఊహించని పరాభవమా ? లేక ఊహించిందేనా? అనేది చర్చనీయాంశంగా మారింది.ఇప్పటి వరకు తేలిన పంచాయతీల ఫలితాల్లో 2500 పంచాయతీల్లో అధికార పార్టీ వైసీపీ దూకుడు భారీగా కనిపించింది.ఇక, తాము గెలుస్తామని, నిలుస్తామని బావించిన టీడీపీ పత్తాలేకుండా పోయిందనే కామెంట్లు వస్తున్నాయి.
ఎక్కడికక్కడ వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు ఆయన పరివారం ప్రయత్నించారు.ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోను, ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయని, పోలీసులు నిర్బంధాలు ఉన్నాయని భారీ ఎత్తున ప్రచారం జరిగింది.
ఇప్పటి వరకు చూస్తే టీడీపీకి కేవలం 500 పంచాయతీలు మాత్రమే దక్కాయి.
ఈ క్రమంలో టీడీపీ ప్రణాళిక ప్రకారం ప్రచారం నిర్వహించింది.
అభ్యర్థులను తమ మద్దతు దారులుగా చేసుకునేందుకు ఎక్కడి కక్కడ క్షేత్రస్థాయిలో గ్రామ నేతలతోనూ చంద్రబాబు ప్రసంగించారు.జూమ్ మీటింగులు పెట్టారు.
ఎక్కడికక్కడ తమ్ముళ్లలో హుషారు నింపే ప్రయత్నం చేశారు.గత ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నారు.
అంతేకాదు వైసీపీ ఎన్నికలకు భయపడుతోందని టీడీపీ హవాను ఆపే శక్తి ఇప్పటి వరకు లేదని వైసీపీకి మొండి చేయి చూపిస్తారని ఇలా అనేక కామెంట్లు టీడీపీ నేతల నోటి నుంచి వచ్చాయి.మరీ ముఖ్యంగా హైకోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
దీంతో నిజంగానే టీడీపీలో కొత్త శక్తి ఏదో పుంజుకుందని అందరూ భావించారు.

కట్ చేస్తే తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఎక్కడా ఐపు అజ లేకుండా పోయింది.కనీసం సగం పంచాయతీలను కైవసం చేసుకోవాలన్న అంతర్గత టార్గెట్లు కూడా టీడీపీని గెలిపించలేక పోయాయి.ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లోనే మ్యానిఫెస్టోను సైతం చంద్రబాబు ప్రకటించారు.
గ్రామాభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందని అన్నారు.గతంలో టీడీపీ హయాంలో భారీ సంఖ్యలో టీడీపీ గ్రామాలను అభివృద్ధి చేసిందనే ప్రచారం పరోక్షంగా తీసుకువెళ్లారు.
గ్రామాల్లో రోడ్లు వేయించామని ఇంటింటికీ నీరు అందించామని వీధి దీపాలు వెలిగించామని ఇలా అనేక రూపాల్లో చంద్రబాబు ప్రచారం చేశారు.కానీ ఫలితం మాత్రం ఫుల్లుగా రివర్స్ అయింది.
దీంతో ఇది ఊహించని పరాజయంగా నే భావిస్తున్నారు తమ్ముళ్లు.మరి దీనిపై అంతర్మథనం చేస్తారో లేదో చూడాలి.