వేసవికాలం ముగిస్తున్న సమయంలో నేరేడు పండ్లు( blueberry ) మనకు విరివిగా లభిస్తాయి.అయితే చిన్న పెద్ద ఇలా తేడా లేకుండా చాలామంది నేరేడు పండ్లను చాలా ఇష్టంగా తింటారు.
నేరేడుపండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.అందుకే నేరేడు పండును ఆయుర్వేదం, హోమియోపతి ( Ayurveda, Homeopathy )లో కూడా ఉపయోగిస్తారు.
అయితే వీటిని మితంగా తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది.అతిగా తింటే లేనిపోని సమస్యలు వస్తాయి.
అతిగా తినడం మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగిన ఈ నేరేడు పండ్లను ప్రతి ఒక్కరూ తినకూడదు.మరి నేరేడు పండ్లను ఎవరు తినకూడదు.? ఎప్పుడు తినకూడదు? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా నేరేడు పండ్లలో ఔషధ గుణాలు( Medicinal properties ) ఉంటాయి.నేరేడు పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.అయినప్పటికీ కూడా నేరేడు పండ్లను అతిగా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇలా ఎక్కువగా తినడం వలన జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.పాలు తాగే పిల్లలు వీటిని పాలు తాగుతున్న సమయంలో లేదా పాలు తాగాక తీసుకోవడం మంచిది కాదు.
ఇలా తీసుకోవడం వలన చిన్న పిల్లలు అనారోగ్యానికి పాలవుతారు.అయితే జ్వరంతో బాధపడుతున్న వారు కూడా నేరేడు పండ్లను తీసుకోవడం మంచిది కాదు.అధికంగా ఈ పండ్లను తీసుకోవడం కన్నా మంచి ఆరోగ్యం కోసం నేరేడు పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగడం మంచిది.

ఇలా చేయడం ద్వారా మీ ముఖంపై మొటిమలు( pimples ) లాంటి సమస్యలు దూరం అవుతాయి.అదనంగా మీ చర్మం మెరుగుపడుతుంది.జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వీటిని ఎక్కువగా తినకూడదు.
ఎక్కువగా తీసుకోవడం వలన ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఇక హై బీపీ ఉన్నవారు కూడా ఎక్కువగా నేరేడు పండ్లను తీసుకోకూడదు.
అధిక రక్తపోటు ఉన్నవారు నేరేడు పండును తీసుకోవడం వలన బీపీ మరింత పెరిగి సమస్యలను తీసుకొస్తుంది.