శ్రీదేవి స్వయం కృపరాధం ! ఇక రాజకీయ భవిష్యత్ కష్టమే ?

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడి వైసిపి అధిష్టానం ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యేల్లో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి( Undavalli Sridevi ) ఒకరు.2019 ఎన్నికల్లో అదృష్టం తలుపు తట్టడంతో అనూహ్యంగా శ్రీదేవి రాజకీయాల్లోకి రావడం , ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి .స్థానికంగా పెద్దగా బలం లేకపోయినా, జగన్ చరిష్మాతో శ్రీదేవి విజయం సాధించారు.డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న శ్రీదేవి జగన్ సతీమణి వైఎస్ భారతీ( Y S Bharati ) పరిచయం కారణంగా , ఆమె సిఫార్సు మేరకు జగన్ శ్రీదేవికి టికెట్ ఇచ్చారు.

 Undavalli Sridevi Political Career  In Ap , Undavalli Sridevi, Tadikonda Mla, Ap-TeluguStop.com

వైఎస్ కుటుంబంతో ఉన్న పరిచయాలతో రాజకీయంగా పై స్థాయికి వెళ్లేందుకు శ్రీదేవి ప్రయత్నించకపోగా.నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెర తీయడం తో గెలిచిన కొద్ది రోజులకి ఆమె వివాహస్పదమయ్యారు.

Telugu Ap Cm Jagan, Dokkamanikya, Mlc, Tadikonda Mla, Ys Bharathi-Politics

ఒక వర్గాన్ని వెనకేసుకు రావడం , అక్కడ మెజార్టీ సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం తో తలపడడం వంటివన్నీ శ్రీదేవికి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.అయినా ఈ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్లకుండా ఆ వివాదాల్లోనే ఉంటూ సమస్యను మరింత పెంచుకున్నారు చివరకు అక్కడి గ్రూపు రాజకీయాలకు విసిగి చెందిన వైసిపి అధిష్టానం తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించింది.దీంతో శ్రీదేవి మరింత అసంతృప్తికి గురయ్యారు.రాబోయే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇచ్చేది లేదని జగన్ సైతం నేరుగా చెప్పడంతో అసంతృప్తితో ఉన్న ఆమెను టిడిపి తమ రూట్ లోకి తెచ్చుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయించకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

ఇప్పుడు ఆ కారణంతోనే ఆమెను వైసిపి సస్పెండ్ చేసింది.

Telugu Ap Cm Jagan, Dokkamanikya, Mlc, Tadikonda Mla, Ys Bharathi-Politics

 టిడిపిలోకి వెళ్లినా, టిక్కెట్ దక్కే పరిస్థితి లేదు.రాజకీయంగా కీలక పదవులు దక్కే అవకాశం కనిపించడం లేదు.దీంతో ఆమె రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి ఇప్పుడు తలెత్తుంది అంటే అది ఆమె స్వయంకృపరాధమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలోనూ ఆమె ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి.ఎమ్మెల్యే పదవి ఉన్నంతకాలం వైసిపి కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకతను, అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube