పవన్ ది తొందరపాటే -తేల్చేసిన ఉండవల్లి!

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసే ఉండవల్లి ( Undavalli )మరోసారి మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు లో తాను సిబిఐ విచారణ కోరడం పై సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై ఆయన స్పందించారు .

 Undavalli Key Comments On Pavan Kalyan , Undavalli , Pawan Kalyan , Tdp , Jana-TeluguStop.com

స్కిల్ స్కాం కేసు లో అసలు వాస్తవాలు బయటకు రావాలనే తాను సిబిఐ విచారణ కోరానని అది జగన్కు, బాబుకు ఇద్దరికీ కూడా మంచిదేనని, చంద్రబాబుకి ఈ కేసుల్లో డైరెక్ట్ గా ముడుపులు ముట్టినట్లు ఆధారాలు లేకపోయినప్పటికీ ఆయనకు పీఏ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా అంతే నిజం అని ఆయన కుండబద్దలు కొట్టారు.

Telugu Chandrababu, Cm Jagan, Janasena, Pawan Kalyan, Undavalli-Telugu Political

చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu arrest ) రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది అన్న ఆయన ఆయన ద్వారా జైల్ కి వెళ్ళిన వారు ఇలా చేసి ఉండవచ్చు అంటూ నర్మగర్బం గా వాఖ్యనించారు.17ఏ చంద్రబాబుకు వర్తిస్తే అసలు జగన్ మీద కేసులే ఉండవని, మంత్రివర్గం నిర్ణయాలకు ఇతరులని బాధ్యుల్ని చేయకూడదు అనుకుంటే అసలు జగన్ అరెస్ట్ జరిగి ఉండకూడదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు .అంతేకాకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి పవన్ తప్పు చేశారని అభిప్రాయపడిన ఉండవల్లి తనను సంప్రదించి ఉంటే కొంతకాలం ఆపి ఉండే వాడిని అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Chandrababu, Cm Jagan, Janasena, Pawan Kalyan, Undavalli-Telugu Political

పవన్ ( Pawan Kalyan )తొందరపాటు వల్ల రాష్ట్రంలో రాజకీయం టిడిపి వర్సెస్ వైసిపి గా మారిపోయిందని కేవలం జనసేన సపోర్టింగ్ రోల్ కి పరిమితం అయిపోయినట్లు అయిందని తద్వారా ఒక మంచి అవకాశాన్ని జనసేన కోల్పోయిందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.చంద్రబాబును వయసు రీత్యా కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని, హౌసా అరెస్ట్ అయినా చేసి ఉండవలసిందని లాలూ ప్రసాద్ యాదవ్ కి కూడా ఇలాంటి సదుపాయం కల్పించారంటూ ఆయన గుర్తు చేశారు.బెయిల్ కోరకుండా పూర్తిగా కేసును కొట్టి వేయమని తెలుగుదేశం అడగటం తనను ఆశ్చర్యపరిచిందని ఉండవెల్లి ( Undavalli )బెయిల్ కోసం కోరి ఉంటే ఇప్పటికే చంద్రబాబు కి రిలీఫ్ దొరికి ఉండేదని అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube