అక్కడికి వెళ్లినవారు బతికిబట్టకట్టలేదు... మానవ అవశేషాలతో నిర్మితమైన ప్రాంతం అది?

ఈ సువిశాల ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి.దూరపు కొండలు నునుపు అన్నట్టు.

మనకు తెలియని ప్రపంచం చాలా అందమైనది అని భావిస్తూ ఉంటాం.కానీ దగ్గరకి వెళ్లి చూసాకే అందులో లోటుపాట్లేమిటో బోధపడతాయి.

ఈ క్రమంలో మనం అనేక ప్రాంతాలు చాలా అందమైనవి అని వింటూ ఉంటాం.అలాగే మరికొన్ని ప్రదేశాలు చాలా స్పెషల్ అని అంటుంటారు.

కొన్ని ప్రాంతాల చరిత్ర ఆసక్తికరంగాను, మరికొన్ని ప్రదేశాల చరిత్ర చాలా భయంకరంగా ఉంటుంది.

Advertisement

ప్రస్తుతం అలాంటి ఓ భయానక ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నాం.ఈ ప్రాంతం సగం భూమి సగం మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతూ వుంటారు.అయితే ఈ నిర్మాణం వెనుక భయంకరమైన చరిత్ర కూడా ఉందని చెబుతారు.

ఇంతకీ ఆ ప్రదేశం ఏదని అనుకుంటున్నారు కదూ? ఇటలీలోని( Italy ) వెనిస్, లిడో నగరాల మధ్య వున్న నిషేధ ప్రాంతమే వెనీషియన్ గల్ఫ్.( Venetian Gulf ) ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు.

మరెక్కడికి పోతారంటారా? పైకే మరి.ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లి బతికి వచ్చిన మనిషి ఒక్కరు కూడా లేరని చెబుతూ వుంటారు.దీంతో ఆ నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది.

ఆ ప్రాంతాన్ని చాలామంది శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు.సుమారు 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్విపం చుట్టూతా ఎత్తైన గోడలు ఉంటాయి.ఈ ద్వీపం ఎందుకు మారిందంటే.ఇటలీలో ప్లేగు మహమ్మారి( Plague ) వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని అప్పటి ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకొని వెళ్లి వదిలేసిందట.ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని భావించిన ప్రభుత్వం అలాంటి దారుణానికి ఒడిగట్టింది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
దీపావళి గిఫ్ట్‌తో తల్లిని సర్‌ప్రైజ్ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఫిదా..

దాంతో ఆ వ్యాధితో ఎవరు చనిపోయినా.మరెవరూ ఆ వ్యాధి బారిన పడకుండా ద్వీపంలోనే వారిని ఖననం చేశారు.

Advertisement

అందుకే ఈ ద్వీపంలోని సగం భూమి మానవ అవశేషాలతో నిర్మితమైందని చెబుతారు.

తాజా వార్తలు