మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలను వేస్తేనే ఆదాయం అనేది ఊహించని రీతిలో ఉంటుంది.రైతులు ( Farmers ) చాలామంది మంచి డిమాండ్ ఉండే పంటలు సాగు చేయాలి అనుకున్న కూడా సరైన అవగాహన లేకపోవడంతో అధిక దిగుబడి సాధించలేకపోతున్నారు.
ముందు వ్యవసాయం చేసే రైతు వేసే పంటపై పూర్తి అవగాహన కల్పించుకోవాలి.కొంతమంది రైతులు దేశవాళీ రేగు పండ్ల సాగు(Plum Fruit ) చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ రేగు పండులో ఎన్నో ఔషధ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అధిక లాభాల కోసం ప్రస్తుతం విదేశీ రేగి మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ విదేశీ రేగుజాతి మొక్కలకు నీటి వనరులు తక్కువగా ఉన్నా కూడా మంచి దిగుబడి వస్తుంది.ఒక ఎకరంలో సాగుచేసిన లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
ఆ విదేశీ రేగు పండు జాతి పేరు ఉమ్రాన్ రేగు.( Umran Ber ) ఈ ఉమ్రాన్ రేగు పండు సాగు చేస్తే ఏకంగా 20 టన్నులకు తగ్గకుండా దిగుబడి పొందవచ్చు.
![Telugu Agriculture, Crop, Drip, Plum, Plum Farmers, Plum Fruits, Umran Ber-Lates Telugu Agriculture, Crop, Drip, Plum, Plum Farmers, Plum Fruits, Umran Ber-Lates](https://telugustop.com/wp-content/uploads/2023/07/umran-ber-cultivation-with-less-investment-detailsa.jpg)
ఈ ఉమ్రాన్ రేగు పంట నాటిన సంవత్సరం నుండి దిగుబడులు పొందవచ్చు.ఒక్కో పండు పరువు సుమారు 30 నుంచి 40 గ్రాముల వరకు ఉంటుంది.వ్యవసాయానికి పనికిరాని బీడు బంజర భూముల్లో ఈ పంటను వేస్తే తక్కువ పెట్టుబడి తోనే దిగుబడి పొందవచ్చు.ఒక ఎకరం పొలంలో 100 మొక్కలు నాటుకొని డ్రిప్ విధానం ద్వారా నీటిని అందించాలి.
మార్చి, ఏప్రిల్ నెలలో పంట కోతకు వస్తుంది.ఆ తర్వాత చెట్లకు కొమ్మ కత్తిరింపులు చేయాలి.
ఆ తర్వాత వచ్చే వర్షాలకు కొమ్మ చిగురించి డిసెంబర్ నుండి కాయలు రావడం మొదలవుతాయి.
![Telugu Agriculture, Crop, Drip, Plum, Plum Farmers, Plum Fruits, Umran Ber-Lates Telugu Agriculture, Crop, Drip, Plum, Plum Farmers, Plum Fruits, Umran Ber-Lates](https://telugustop.com/wp-content/uploads/2023/07/umran-ber-cultivation-with-less-investment-detailss.jpg)
ఇక నీటిలో కరిగే ఎరువులను డ్రిప్( Drip ) ద్వారా రెండు రోజులకు ఒకసారి మూడు కిలోల చొప్పున ఎరువులు అందించాలి.ఒక్కొక్క చెట్టుకు ఐదు కిలోల పశువుల ఎరువు, 10 కిలోల కొత్త మట్టి వేసుకోవాలి.అమ్మలు కత్తిరించిన అనంతరం నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను తగిన మోతాదులో పాదుల్లో వేసి మట్టిని తిరగకొట్టాలి.
ఈ జాతికి చెందిన రేగిపండ్లకు మార్కెట్లో ధర సుమారుగా 18 వరకు పలుకుతుంది.ఒక ఎకరం పొలంలో పండిన పంటకు దాదాపుగా 1.5 లక్షల దిగుబడి వస్తుంది.పెట్టుబడి ఓ రూ.60 వేల వరకు వస్తుంది.అంటే దాదాపుగా ఒక ఎకరం పొలంలో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు ఉదయం పొందవచ్చు.మంచి వ్యవసాయ భూమి అయితే ఇతర అంతర పంటలు కూడా పండించవచ్చు.