రష్యా, ఉక్రెయిన్( Russia, Ukraine ) వార్ మొదలై 14 నెలలు కావస్తోంది.అయినా ఈ భయానక యుద్ధానికి హద్దే లేకుండా పోతోంది.
ఇప్పటికే ఇరుదేశాలకు ఎంతో నష్టం వాటిల్లింది.ఇంకా దేనికోసం ఆ ఇరుదేశాలు తలపడుతున్నాయి అర్ధం కావడం లేదు.
ఒక రకంగా చెప్పాలంటే రష్యా కంటే ఉక్రెయిన్ చాలా తీవ్రస్థాయిలో నష్టపోతోంది.దాదాపుగా సగం నాశనం కాగా మిగిలిన సగం కూడా మెల్లమెల్లగా అతలాకుతలం అవుతోంది.
ఉక్రెయిన్ ఇపుడు మట్టి కుప్పలతోనూ, భవనాల శిధలాలతోనూ, శవాలతోను నిండిపోయింది.

ఇక అలాంటి స్థితిగతుల మధ్య పరిపాలిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పటిదాకా డిఫెన్స్ వ్యూహం అనుసరిస్తూ వచ్చాడు.ఈ క్రమంలో రష్యా చేతిలోకి తన పట్టణాలు, నగరాలు, పల్లెలు వెళ్ళకుండా జాగ్రత్త వహిస్తున్నాడు.ఇక రష్యాన్ని ఎంతోకాలం నిలవరించలేమని, రష్యాని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న జెలెన్స్కి( Zelensky ) కొత్తరకం వ్యూహాలను రచిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కీలకమైనటువంటి అడుగు వేసింది ఉక్రెయిన్.తాజాగా ఉక్రెయిన్ కు సంబంధించినటువంటి ప్రాంతాలను ఆక్రమించినటువంటి రష్యాను దెబ్బతీయడానికి 2014 నుండి రష్యా అధీనంలో ఉన్న క్రిమియాను తాను స్వాధీనం చేసుకోవడానికి అడుగులు వేస్తానన్నాడు జెలెన్స్కి.

ఈ వ్యూహం వర్కవుట్ అయితే రష్యా సగం కృంగిపోతుందని భావిస్తున్నాడు.రష్యాను బ్లాక్ చేయడానికి రూట్ మ్యాప్ రెడీ చేసాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.అసలు విషయం ఏమంటే రూట్ మ్యాప్ వలన రష్యాని మొదట దశలో బ్లాక్ చేయడం సాధ్యం కాని పని అని నిపుణులు చెప్పగా రెండవ దశలో బ్లాక్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది ఉక్రెయిన్.ఈ సారైనా విజయం సాధిస్తుందేమో చూడాలి మరి.







