నిర్మాత చేసిన పనికి లతా, బప్పి నోర్లు మూతలు పడ్డాయట ? ఏం జరిగింది ?

పహ్లాజ్ నిహలానీ.1991లో ఓ సినిమా చేసింది.దాని పేరు ఫస్ట్ లవ్ లెటర్.

ఈ సినిమాకు బప్పిలహరి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాల సుబ్రమణ్యంతోనే అన్ని పాటలు పాడించాడు.

లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా క్రిష్ణమూర్తి మరికొంత మంది ఫీమేల్ గాయకులున్నారు.నిహలానీ పాటల విషయంలో అస్సలు వెనక్కి తగ్గడు.

ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా తను మళ్లీ పాడిస్తాడు.బప్పి కూడా తన అభిరుచికి తగినట్లుగా పాటలను కంపోజ్ చేశాడు.

Advertisement

అందులో ఓ పాట తోతా తోతా.మనీషా కోయిరాలకు తొలి సినిమా.

హీరో వివేక్ ముష్రాన్, చుంకీపాండే కూడా ఉన్నాడు.ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్ లో ఈ పాట రికార్డు అయ్యింది.

ఇంకా లతా, బాలు అక్కడే ఉన్నారు.నిహలానీకి ఆ పాట వింటుంటే ఏదో కొద్ది తేడా ఉంది.

రావాల్సిన ఫీలింగ్ ఇందులో కనిపించడం లేదు.ఎమోషన్ లతా గొంతులో కనిపించలేదు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

క్యాజువల్ గా పాడింది అనిపించింది.వెంటనే బప్పిని పిలిచి మళ్లీ పాటను పాడించి రికార్డు చేయించాల్సిందిగా కోరాడు.

Advertisement

బప్పీ షాక్ అయ్యాడు.అయితే అందుకు బప్పి ఒప్పుకోలేదు.

ఒకసారి పాడిన పాట బాగాలేదని చెప్పి మళ్లీ పాడించాలా? నావల్ల కాదు అని చెప్పాడు.నువ్వు సంగీత దర్శకుడివి.

నాకు కావాల్సినట్టుగా పాట ఇవ్వాలి అంటాడు దర్శకుడు.మీరెన్ని చెప్పినా నావల్లకాదు.

నాకంత ధైర్యం లేదంటాడు.

ఇక లాభం లేదని నిహలానీ లతా దగ్గరికి వెళ్తాడు.లతాజీ పాట బాగా పాడారు.కానీ.

మరింత ఎక్స్ ప్రెషన్ తో పాడితే ఇంకా బాగుంటుంది అన్నాడు.ఆమెకు బాగా కోపం వచ్చింది.

పోనీ ఎలా పాడితే బాగుంటుందో పాడి చూపించండి అన్నది.ఏ పదాల దగ్గర తనకు ఎలా కావాలో పాడి చూపించాడు.

లత మాట మాట్లాడలేదు.మళ్లీ పాడింది.

నిహలానీ సంతోష పడ్డాడు.తాజాగా ఈ విషయాన్ని లత చనిపోయిన సమయంలో బప్పి దా వెల్లడించాడు.

ఆయన కూడా ఆ తర్వాత కొద్ది రోజులకే కన్నుమూశాడు.

తాజా వార్తలు