బ్రిటన్ నిభంధనతో భారత విద్యార్ధుల కి కష్టాలు..

బ్రిటన్ ప్రభుత్వం రూపొందిచిన తాజా స్టూడెంట్ వీసా విధానంలో భారత్ ని చేర్చకుండానే విధానాలని విడుదల చేసింది దాంతో ఒక్కసారిగా భారత విద్యార్ధులలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.రెండు రోజుల క్రితం భారత వైద్యులకోసం బ్రిటన్ ఏకంగా వీసా నిభంధనలనే మార్చి వెసులుబాటు కల్పిస్తే మరి విద్యార్ధుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది…అయితే వీసాలకి వెసులు బాటు ఇస్తూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేస్తూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

 Uk Visa Rules Will Be A Dampener For Indian Students-TeluguStop.com

4 టైర్ వీసా.కేటగిరిలో విద్యార్ధులకి వెసులుబాటు ఇస్తూ హోంశాఖ ప్రకటన చేసింది అయితే కొత్త జాబితాలో 25 దేశాలను చేర్చారు.ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్ దేశాలు జాబితాలో ఉండగా కొత్తగా చైనా, బహ్రెయిన్, సెర్బియా చేరాయి.ఈ దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు అనేక సడలింపులు కల్పించారు…దీంట్లో విద్యార్ధి ఆర్దిక మరియు ఆంగ్ల బాషా పరిజ్ఞానం ఆపై నిభందనలు ఏమీ ఉండవు దాంతో వీరు బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లో వారు సులభంగానే ప్రవేశాల పొందవచ్చు…అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడంతో భారత్ తీవ్రంగా మండిపడుతోంది.

అయితే ఈ పరిస్థితి పై యూకే కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అఫైర్స్ (యూకేసీఐఎస్‌ఏ) చైర్మన్, భారత సంతతి పారిశ్రామికవేత్త లార్డ్ కరన్ బిల్మోరియా చాలా ఘాటుగా స్పందించారు.మా విద్యార్ధులు బ్రిటన్ లో చదవాలి అంటే ఎన్నో ఖతినమైన నిభందనలు ఎదుర్కోవాలి ఇదెక్కడి న్యాయం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

థెరిసామే ప్రభుత్వ తప్పుడు నిర్ణయమని బిల్మోరియా ధ్వజమెత్తారు.

బ్రిటన్‌కు…భారత్ ఎప్పటి నుంచో.మిత్రదేశం.బ్రిటన్ ఎదుగుదలలో భారత్ సహకారం ఎంతో ఆంది అనే విషయం మర్చిపోయారు అంటూ విమర్శించారు…అయితే యూకేలో భారత హైకమిషన్ వైకే సిన్హా గత వారం బ్రిటన్ వర్శిటీల మంత్రి శామ్ గైమాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

అయితే ప్రభుత్వాల చొరవతో విధ్యర్ధులకీ ఈ కష్టాలు తప్పితే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube