టీడీపీ వారికే ఈ ప్రశ్నలు అట ! సమాధానం అడుగుతున్న వైసీపీ !

నాలుగేళ్లు కలిసి తిరిగారు .ఒకరి కేబినెట్లో ఒకరు పదవులు పంచుకున్నారు.

 Ysrcp Asking 10 Questions To Tdp-TeluguStop.com

టీడీపీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కేంద్ర అధికార పార్టీ బీజేపీ ప్రశంసిస్తే… బీజేపీ బ్రమ్మాండంగా పనిచేస్తోందని టీడీపీ పొగిడింది.అయితే వారి మధ్య విబేధాలు వచ్చాయి.

ఏపీకి బీజేపీ అన్యాయం చేసింది అని, తెలుగుదేశం విమర్శలు చేసి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది….ముఖ్యంగా ఎన్డీయే నుంచి టీడీపీ ఇదే విషయంపై విభేదించి బయటకు వచ్చింది.

అయితే ఇక్కడ వైసీపీ నాయకులు నాయకులు టీడీపీని అడిగేవి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

1.ప్రధాని నరేంద్రమోదీని అమరావతికి శంకుస్తాపనకు ఆహ్వానించింది ఎవరు?
2.400 కోట్ల రూపాయలతో ఆర్బాటంగా కార్యక్రమం చేయించింది ఎవరు?
3.నీరు మట్టి తీసుకురమ్మని మోదికి చెప్పింది ఎవరు?
4.బీజేపీ నాయకులతో నాలుగేళ్లు కలిసింది ఎవరు?
5.ప్రత్యేక హూదా సంజీవనా అని ప్రశ్నించింది ఎవరు?
6.ప్రత్యేకహోదా వస్తే ఉద్యోగాలు వస్తాయా అని క్వశ్చన్ వేసింది ఎవరు?
7.మన రాష్ట్రానికి కేంద్రం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఇచ్చింది అని చెప్పంది మీరు కాదా? అది పచ్చ పత్రికల్లో రాలేదా?

8.బీజేపీని పొగిడింది మీరు కాదా? దేశంలో నోట్ల రద్దును ఆహ్వానించింది మీరు కాదా?

9…29 సార్లు ఢిల్లీలో ప్రధానిని కలిశాను అంటున్నారు ఎందుకు కలిశారు అనేది చెప్పారా? 10.ఓటుకు నోటు కోసం బయపడి హైదరాబాద్ నుంచి కరకట్టకు జగన్ పారిపోయాడా లేదా ఎవరు పారిపోయారు.?

జగన్ పై విమర్శలు చేయడం తెలుగుదేశానికి అలవాటుగా అదో టీడీపీ ఆనవాయితీగా మారిపొయింది అని వైసీపీ విమర్శిస్తోంది… రాష్ట్రంలో చిన్న పిల్లవాడు చీమ కుట్టి ఏడ్చినా దానికి జగన్ కారణం అనేలా ఉన్నారు అని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.తెలుగుదేశం నాయకులు బీజేపీతో జగన్ కలిశాడు అని అంటున్నారు.మరీ మీరు నాలుగేళ్లు కలిసి సాధించింది ఏమిటో ఓ సారి చెప్పండి ప్రజలకు అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ని హైలెట్ చేస్తున్నారు వైసీపీకి చెందిన వారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube