వచ్చే వారం అమెరికా పర్యటనకు రిషి సునాక్.. జో బైడెన్‌తో భేటీకానున్న బ్రిటీష్ ప్రధాని

భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్( British Prime Minister Rishi Sunak ) వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీకానున్నారు.వచ్చే బుధ, గురువారాల్లో బ్రిటీష్ ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారు.

 Uk Pm Rishi Sunak To Visit Washington Next Week For Talks With Joe Biden , Joe B-TeluguStop.com

ఈ సందర్భంగా జో బైడెన్, యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, యూఎస్ బిజినెస్ లీడర్స్‌తో ఆయన సమావేశం కానున్నారు.ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ వ్యవహారాలు, ఉక్రెయిన్( Ukraine ) యుద్ధం తదితర అంశాలకు సంబంధించి బైడెన్‌తో రిషి చర్చించే అవకాశాలు వున్నాయి.

గతేడాది అక్టోబర్‌లో యూకే ప్రధాన మంత్రిగా నియమితులైన తర్వాత రిషి సునాక్‌కు ఇదే తొలి అమెరికా పర్యటన.2020లో బ్రిటన్.యూరోపియన్ యూనియన్ ( European Union )నుంచి తప్పుకున్న నేపథ్యంలో అమెరికాతో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలని సునాక్ భావిస్తున్నారు.అయితే గత నెలలో బ్రిటిష్ ప్రావిన్స్ అయిన నార్త్ ఐర్లాండ్‌‌లో కేవలం సగం రోజును గడిపిన జో బైడెన్.

సౌత్ ఐరిష్ రిపబ్లిక్‌లో ( Republic of South Ireland )మాత్రం రెండున్నర రోజులు గడపటంపై బ్రిటీష్ అనుకూల మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలోనే ఆయనను బ్రిటీష్ వ్యతిరేకిగా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

Telugu Donald Trump, Joe Biden, Ukraine, Washington-Telugu NRI

మరోవైపు.బైడెన్ పరిపాలనా యంత్రాంగం యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు కూడా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.బైడెన్ అధికారంలోకి రాకముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ( Donald Trump )హయాంలో ఈ ఒప్పందంపై చర్చలు పురోగమించాయి.ఇక తాజా అమెరికా పర్యటనపై సునాక్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈసారి చర్చలు వుండవని స్పష్టం చేశారు.దీనికి బదులుగా వ్యక్తిగతంగా అమెరికన్ రాష్ట్రాలతో ఒప్పందాలు వంటి ఇతర మార్గాల్లో వాణిజ్యానికి వున్న అడ్డంకులు తొలగించడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

Telugu Donald Trump, Joe Biden, Ukraine, Washington-Telugu NRI

అటు నార్త్ ఐర్లాండ్‌పై( Northern Ireland ) ఏడాదికి పైగా ప్రభుత్వం లేకపోవడంపై ఇద్దరు నేతలు చర్చిస్తారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఏడాది మార్చిలో AUKUS అని పిలిచే ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ మధ్య జలాంతర్గామి కూటమికి సంబంధించి తదుపరి దశను ప్రారంభించేందుకు శాన్‌డియాగోలో కలుసుకున్నప్పుడు వైట్‌హౌస్‌కు రావాలని రిషి సునాక్‌ను బైడెన్ ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube