బ్రిటన్ : తమ కళతో క్వీన్ ఎలిజబెత్ IIకి భారత సంతతి ఆర్టిస్ట్‌ల ఘన నివాళి..!!

70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను ఏలిన క్వీన్ ఎలిజబెత్ II మరణంతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.పలువురు దేశాధినేతలు, ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.

 Uk Indian Origin Artists Create Giant Mural Tribute To Queen Elizabeth Ii-TeluguStop.com

ఇప్పటికే క్వీన్ అంతిమ సంస్కారాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో ఎలిజబెత్‌కు నివాళిగా పశ్చిమ లండన్‌కు చెందిన ఇద్దరు భారత సంతతి కళాకారులు రాణి కుడ్య చిత్రాన్ని తయారు చేస్తున్నారు . జిగ్నేష్, యష్ పటేల్‌లు క్వీన్ మరణించిన రోజు నుంచి ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు.వీరు రూపొందిస్తున్న కుడ్య చిత్రం .పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌ ప్రాంతంలో దూరం నుంచి కనిపిస్తుంది.

యూకేలోని భారతీయ డయాస్పోరా (ఐడీయూకే) గ్రూప్.

గో ఫండ్ మీ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ నిధుల సమీకరణ ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచింది.ఇప్పటి వరకు దాదాపు 1000 డాలర్లకు పైగా నిధులను వీరు సేకరించారు.

ఈ సందర్భంగా ఐడీయూకే ప్రతినిధులు మాట్లాడుతూ.ఈ కళాకృతి ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్‌కి నివాళులర్పించడం మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో యూకే అంతటా వేలాది మంది చూసి ఆనందించే కళాఖండం అవుతుందన్నారు.

Telugu Hounslow, Iduk, Indian Origin, Jigneshyash, Kingsley Road, Tribute-Telugu

జిగ్నేష్, యష్ పటేట్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద బబుల్ ర్యాప్ పెయింటింగ్ వంటి ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తమ పేరిట కలిగి వున్నారు.2021లో 2,00,000 బుడగలు నింపి సరికొత్త రికార్డు సృష్టించారు.వీరిద్దరూ తమ కళల ద్వారా వివిధ ఛారిటీ, కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లకు అండగా నిలుస్తున్నారని ఐడీయూకే గ్రూప్ ప్రశంసించింది.ప్రస్తుత క్వీన్ ఎలిజబెత్ 2 కుడ్య చిత్రం హౌన్స్‌ ఈస్ట్‌లోని కింగ్స్‌లీ రోడ్ ప్రాంతంలో వున్న రెండంతస్తుల భవనంపై రూపొందిస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఇప్పటికే డచ్ ఇంప్రెషనిస్ట్ కళాకారుడు వాన్ గోహ్ పెద్ద కుడ్య చిత్రాన్ని చిత్రించిన కళాకారులు … ఈ ఏరియాను మరింత తీర్చిదిద్దడానికి గాను తమ వీధిని కుడ్య చిత్రాలతో నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.యష్ పటేల్ మాట్లాడుతూ.

దివంగత మహారాణికి తమ నైపుణ్యం ద్వారా నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ స్థానికులను కూడా ఒకచోటికి చేర్చిందన్నారు.

స్థానిక కౌన్సిలర్‌లతో కలిసి సమిష్టి కమ్యూనిటీ ప్రయత్నమని పటేల్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube