ఫ్యామిలీతో వస్తే బ్యానే .. అంతర్జాతీయ విద్యార్ధులకు షాకిచ్చేందుకు యూకే రెడీ..!!

అంతర్జాతీయ విద్యార్ధులకు షాకిచ్చేందుకు యూకే రెడీ అయ్యింది.ఫ్యామిలీతో పాటు తమ దేశం వచ్చే విద్యార్ధులను నియంత్రించాలని బ్రిటీష్ ప్రభుత్వం యోచిస్తోంది.

అంతర్జాతీయ విద్యార్ధులు హై వాల్యూ డిగ్రీలను అభ్యసించని పక్షంలో వారి జీవిత భాగస్వాములు, పిల్లలను యూకేకు తీసుకురాకుండా చూడాలని భావిస్తోంది.టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.

సైన్స్, గణితం, ఇంజనీరింగ్ చదువుతున్న అంతర్జాతీయ విద్యార్ధులు మాత్రమే తమపై ఆధారపడిన వారిని యూకేకి తీసుకురాగలరు.కొత్త ప్రతిపాదన ప్రకారం మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీ వంటి ఉన్నత స్థాయి చదువులైతేనే తమపై ఆధారపడిన వారిని యూకేకు తీసుకురాగలరు.

ఇదిలావుండగా.బ్రిటన్‌లో విదేశీ విద్యార్ధులతో పాటు వుండే కుటుంబ సభ్యుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎనిమిది రెట్లు పెరిగింది.

Advertisement

ఇమ్మిగ్రేషన్ లెక్కల ప్రకారం.గతేడాది దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులకు వీసాలు మంజూరు చేశారు.వీరితో పాటు వారిపై ఆధారపడిన వారు (భార్యాభర్తలు, పిల్లలు) 1,35,788 మంది వున్నారు.2019లో వీరి సంఖ్య 16,047గా వుంది.ఇందులో గతేడాది యూకేకు వచ్చిన 33,240 మంది డిపెండెంట్లతో సహా 1,61,000 మంది విద్యార్ధులతో భారత్ అగ్రస్థానంలో వుంది.

ఇకపోతే.యూకేలో శరణార్ధుల బ్యాక్‌లాగ్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.గణాంకాల ప్రకారం 1,60,000కు పైగా వలసదారులు వారి దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ వివాదాస్పద అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని నివేదిక చెబుతోంది.ఇదిలావుండగా.భారత సంతతికి చెందిన యూకే హోంసెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ విదేశీ విద్యార్ధుల రాకను నియంత్రించాలని గట్టి పట్టుదలతో వున్నారు.

అయితే ఈ ప్రతిపాదనను కొందరు మేధావులు తప్పుబడుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

విదేశీ విద్యార్ధులపై ఆంక్షలు విధిస్తే.వారిపై ఆధారపడ్డ యూకే విశ్వవిద్యాలయాలు దివాళా తీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతర్జాతీయ విద్యార్ధులు యూకే ఆర్ధిక వ్యవస్థకు ఏడాదికి 35 బిలియన్ పౌండ్లను అందిస్తున్నారని అంచనా.

Advertisement

యూకే కేంద్రంగా పనిచేస్తున్న న్యూ వే కన్సల్టెన్సీ ప్రకారం.విదేశీ విద్యార్ధులు , వారిపై ఆధారపడిన వారి వల్ల యూకే ఆర్ధిక వ్యవస్థకు 10,000 వేల పౌండ్ల నుంచి 26,000 పౌండ్లు (ఒక్కో విద్యార్ధి నుంచి) సమకూరుతుంది.

దీనికి వీసా ఖర్చులు, బస, ఇతరత్రా వ్యయాలు అదనం.

తాజా వార్తలు