ఓ యువకుడు ఒక ఛారిటీ కోసం పెద్ద మొత్తంలో నిధులు కూడ బెట్టి రికార్డు సృష్టించాడు.ఈ క్రమంలో ఓ ఛారిటీకోసం( Charity ) అంతలా డబ్బులు కూడబెట్టిన తొలి వ్యక్తిగా ఆ టీనేజర్ పేరు ప్రఖ్యాతలు గడించాడు.‘ది బాయ్ ఇన్ ది టెన్ట్’గా పేరుగాంచి ఈ రికార్డు సాధించాడు.వివరాల్లోకి వెళితే, యూకేకి( UK ) చెందిన మాక్స్ వూసే అనే యువకుకి తన జీవితంలో ఓ చేదు అనుభవం ఎదురైంది.
తమ పొరుగన ఉండే ఫ్యామిలీ స్నేహితుడిని క్యాన్సర్ వ్యాధి( Cancer ) కారణంగా కోల్పోయాడు.దానికి అతగాడు చాలా దారుణంగా ఫీల్ అయ్యాడు.ఈ క్రమంలోనే అలాంటివారికి అండగా నిలవాలని ఆలోచన చేసాడు.

అనుకున్నదే తడవుగా నార్త్ డెవాన్ ఛారిటీ కోసం మూడేళ్లుగా క్యాంపింగ్ నిర్వహించి అత్యధికంగా డబ్బును సేకరించాడు.ఇలా అతను సుమారు రూ.7.6 కోట్లకు పైగా వసూలు చేశాడు.అందుకోసం పలుచోట్లకు టెంట్ ( Tent ) తోసహా తిరిగేవాడు.
అక్కడ క్యాంపింగ్ నిర్వహించి టెంట్‌లోనే నిద్రపోయేవాడట.అలా ఇంటికి రాకుండా ఓ అజ్ఞాతవ్యక్తిగా మూడేళ్లు అదే ధ్యాసలో గడిపాడు.
దీంతో వూసే ‘ది బాయ్ ఇన్ ది టెన్ట్’గా పేరుగాంచాడు.ఇలా వూసే తన ఫ్యామిలీ స్నేహితుడు రిక్ అబాట్ మరణించిన తర్వాత నుంచి అంటే.
వూసేకి 10 ఏళ్ల ప్రాయం నుంచి నిధుల సేకరణ మొదలుపెట్టాడు.

అయితే తన స్నేహితుడి రిక్‌కు వూసే కుటుంబం ఆర్థిక సాయం అందిచిన్పటికీ వైద్యులు అతన్ని కాపాడలేకపోయారు.ఆ ఘటన ఫ్యామిలీ స్నేహితుడిలాంటి వారి కోసం ఏదో చేయమన్నట్లు తన మనసుకు బలంగా అనిపించిందని చెబుతున్నాడు ఈ నిజమైన హీరో.వూసే నిధుల సేకరణ మొదలు పెట్టే సమయంలోనే కరోనా, తుపానులు అతగాడికి పెద్ద పరీక్ష పెట్టాయి.
తీవ్రమైన గడ్డకట్టే మంచుకుని సైతం అధిగమించి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ఈ నిధులను సమకూర్చాడు.ఒకనొక సమయంలో తుపాను కారణంగా వూసే టెంట్ కూడా గాలికి ఎగిరిపోయింది.
అయినా మొక్కవోని దీక్షతో నిధులు సేకరించాడు.
