ఉబెర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదనే చెప్పాలి.విశేషంగా ప్రయాణికులను అకట్టుకుంటూ వస్తుంది.
ఉబెర్ సర్వీసును కూడా ప్రయాణికులు బానే ఉపయోగించుకుంటున్నారు.ఉబెర్ సంస్థ టాక్సీ క్యాబ్ మాత్రమే కాకుండా ఫుడ్ డెలివరీ, ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే.
ఉబెర్ ద్వారా ఎంతోమంది రైడర్లు డబ్బులను సంపాదించుకుంటున్నారు.అయితే ఉబెర్ యాప్ లో రైడ్ కాస్ట్‌ను షేర్ చేసుకుంటూ కాస్త మనీ సేవ్ చేసుకుంటున్న రైడర్లకు ఉబెర్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
అది ఏంటంటే.ఉబెర్ లో బాగా పాపులర్ అయిన స్ప్లిట్- ఫేర్ ఫీచర్‌ను తాత్కాలికంగా రిమూవ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఫీచర్ ను తీసివేయడానికి గల కారణం ఏంటంటే.భవిష్యత్తులో మరిన్ని మార్పులు చేసి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలనీ కంపనీ చెబుతుంది.ఫ్యూచర్ లో ప్రవేశపెట్టే సరికొత్త మార్పులతో రైడర్లు ఉబెర్ ను బాగా ఉపయోగించుకోవచ్చని ఉబెర్ కంపెనీ చెబుతోంది.మళ్ళీ ఫీచర్ అందుబాటులోకి వచ్చేంత వరకు యూజర్లు తమ రైడ్ ఛార్జీలను ఇతరులతో షేర్ చేసుకోవడం కుదరదని కంపనీ చెబుతుంది.
అయితే రానున్న రోజుల్లో ఉబెర్ స్ప్లిట్ – ఫేర్ ఫీచర్ ను ఎలా ఇంప్రూవ్ చేస్తుందనేది ఇంకా తెలియలేదు.

వచ్చే నెల ఏప్రిల్ నుంచి స్ప్లిట్ – ఫేర్ ఆప్షన్ ను ఉబెర్ యాప్ లో నుంచి పూర్తిగా రిమూవ్ చేసేస్తుందని కంపనీ తెలిపింది.జూన్ నాటికి కొత్త వెర్షన్ విడుదల అవ్వచ్చు అని తెలుస్తోంది.అయితే ఏప్రిల్ నుంచి మాత్రమే ఉబెర్ యాప్‌లో స్ప్లిట్ ఫేర్ ఫీచర్ కనిపించదని కంపెనీ చెబుతోంది కానీ ఉబెర్ యాప్ లో ఈ ఫీచర్ ను కంపెనీ ఇప్పటికే డిసేబుల్ చేసినట్లు కనిపిస్తోంది.
ఒకవేళ ఇది ఏమైనా టెక్నికల్ ఎర్రరా.? లేక కావాలనే డిలీట్ చేసారా అనే విషయం పట్ల ఉబెర్ నుంచి క్లారిటీ రావాలిసి ఉంది.అయితే కంపనీ ఇలా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి ఉబెర్ డ్రైవర్ల సమస్యలను, వారి సలహాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు.







