యూఏఈ కొత్త రెసిడెన్సీ పధకం...వారి ఆకర్షణలో భాగంగానే....కండిషన్స్ అప్ప్లై...!!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తమ దేశాభివృద్ది కోసం నిపుణులైన ఉద్యోగుల కోసం జల్లెడ పడుతున్నాయి.మీరు ఏ రంగంలో నిష్ణాతులైన సరే మా దేశానికి వచ్చేయండి అంటూ పిలుపునిస్తున్నాయి.

 Uae New Residency Scheme Part Of Their Attraction Conditions Apply, Uae, New R-TeluguStop.com

ఆకర్షణీయమైన జీతం, అన్ని వసతులు, శాశ్వత హోదా హక్కు ఇలా ఎన్నో ఆఫర్లు చూపిస్తూ ఆకర్షిస్తున్నాయి.అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ఇలా ఎన్నో దేశాలు ఈ ప్రయత్నాలలో ముందు వరుసలో ఉండగా తాజాగా ఈ లిస్ట్ లోకి యూఎఈ కూడా చేరింది.

యూఎఈ తమదేశంలోకి రావాలనుకునే ప్రవాసుల కోసం మరో కొత్త రెసిడెన్సీ పధకాన్ని ప్రవేశపెట్టింది.ఈ పధకం కేవలం తమదేశంలోకి మేధో వలసలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంగా తెలిపింది.

నిపుణులైన వారికి ఆహ్వానం అందిస్తోంది.ఐదేళ్ళ కాల పరిమితితో తీసుకువచ్చిన ఈ పధకంపై గంపెడు ఆశలు కూడా పెట్టుకుంది.

పెట్టుబడిదారులను, ఫ్రీలాన్సర్లను, నిపుణులను ఆకర్షించేందుకు ఈ తాజా రెసిడెన్సీ పధకం తీసుకువచ్చినట్టుగా అధికారిక ప్రకటన చేసింది.ఈ నూతన స్కీమ్ ప్రకారం.

ఈ రెసిడెన్సీ పొందినవారు ఐదేళ్ళ తరువాత నివాస అనుమతి రద్దు చేయబడినా, గడువు ముగిసినా దేశంలో సుమారు 6 నెలల పాటు ఉండే అవకాశాన్ని కల్పించింది.ఇదే ఈ పధకం ప్రత్యేకతగా తెలిపింది.

నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా సరే ఎలాంటి స్పాన్సర్ ఎంప్లాయర్ అవసరం లేకుండానే నివాస అనుమతిని కల్పిస్తోంది.అయితే ఈ పధకం పొందేందుకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి.

ఈ పధకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా ఎంప్లాయి మెంట్ కాంట్రాక్ట్ ను కలిగి ఉండాల్సిందే, మానవ వనరుల మంత్రిత్వశాఖ నిభంధనల ప్రకారం వృత్తి పరమైన స్థాయిలను కలిగి ఉండాలి.అలాగే కనీస డిగ్రీ విద్య అర్హత తప్పనిసరి.అంతేకాదు నెలకు సుమారు రూ.3.50 లక్షల కంటే తక్కువ ఉండకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube