స్మార్ట్ ఫోన్ అనేది ఇపుడు బిక్షాధికారి నుండి లక్షాధికారి వరకు అందరి దగ్గర కొలువు దీరింది.దాంతోనే స్మార్ట్ యుగం అని ఈ కలియుగాన్ని పిలుస్తున్నారు కొందరు ఉద్ధండులు.
దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియా ప్రభావం అనేది బాగా ప్రబలింది.దేశంలో జరిగే వివిధ విషయాలు ఇక్కడ మనకు వీడియో కంటెంట్ రూపంలో లభిస్తున్నాయి.
అందులో కొన్ని రకాల వీడియోలు ఆహుతులను ఎంతగానో అలరిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఓ వీడియో నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.
ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్ని మరిచి వీధిలో డ్యాన్స్ వేస్తూ ఉల్లాసంగా గడిపిన వీడియోను నాగాలాండ్ మంత్రి అయినటువంటి తెమ్జెన్ ఇన అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఈ వీడియోని గమనిస్తే ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి వీదిలో ఉల్లసంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండటం గమనించవచ్చు.
అదేదో ఇండియన్ సినిమా పాటకు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.మైఖేల్ జాక్సన్ సిగ్నేచర్ స్టెప్స్‌ను వీరు ప్రయత్నిస్తున్న తీరు నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటోంది.

ఆయన సదరు వీడియోని షేర్ చేస్తూ “మీరు జీవితంలో సంతోషాన్ని కోరుకుంటే ప్రజల మాటల్ని హృదయానికి తీసుకోవద్దు!” అని క్యాప్షన్ ఇచ్చారు.ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 75,000కుపైగా వ్యూస్ రావడం కొసమెరుపు.అంతేకాకుండా పెద్దసంఖ్యలో నెటిజన్లు దానిపై రియాక్ట్ కావడం విశేషం.అలాంటి ఆనందమయ జీవితం అందరిలోనూ రావాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.వేషధారణను బట్టి ఎప్పుడూ ఎవరినీ జడ్జ్ చేయకండని మరో యూజర్ కామెంట్ చేయగా ఈ వీడియో ఈరోజు తన ముఖంపై నవ్వులు పూయించిందని మరో యూజర్ కామెంట్ చేశారు.







