యూట్యూబ్ లో సరికొత్తగా రెండు జనరేటివ్ AI ఫీచర్లు..! ఎలా పని చేస్తాయాంటే..!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్, తన యూట్యూబ్( Youtube ) యూజర్ల ఎక్స్ పీరియన్స్ ను ఇంప్రూవ్ చేయడానికి రెండు సరికొత్త జనరేటివ్ AI ఫీచర్లను( Generative AI features ) అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ సరికొత్త ఫీచర్లకు సంబంధించిన ఉపయోగాలు, యాక్సెస్ వివరాల గురించి తెలుసుకుందాం.

కన్వర్జేషనల్ AI టూల్: ఈ ఫీచర్ AI వ్యూవర్స్ చూస్తున్న వీడియోలకు సంబంధించిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలను అందిస్తుంది.

ఈ ఫీచర్ రిలేటెడ్ కంటెంట్, బ్యాక్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లాంటి వాటిని సూచించడం చేస్తుంది.అంతే కాకుండా ఎడ్యుకేషనల్ వీడియోలు( Educational videos ) చూసే విద్యార్థుల కోసం క్విజ్ లు, రెస్పాన్స్ లను( Quizzes , responses ) ప్రొవైడ్ చేసేలా ప్రత్యకంగా ఈ ఫీచర్ తయారు చేశారు.ఇక పై ఈ ఫీచర్ తో వీడియో ప్లే బ్యాక్ కు ఎలాంటి అంతరాయం కలుగదు.

రెండవ ఫీచర్ ఏమిటంటే.ఎక్స్ టెన్సిన్ కామెంట్ థ్రెడ్స్ ( Ex tensin comment threads )తో యూట్యూబ్ వీడియోల కామెంట్స్ కేటగరైజ్ చేయడం కోసం AI ను ఉపయోగిస్తుంది.ఈ ఫీచర్ కామెంట్స్ ను థీమ్స్ లేదా టాపిక్స్ గా విభజిస్తుంది.

Advertisement

ఇకపై యూజర్లు చాలా సులభంగా డిస్కషన్స్ లో పాల్గొనే సదుపాయాన్ని ఈ సరికొత్త ఫీచర్ అందించనుంది.ఈ ఫీచర్ తో కంటెంట్ క్రియేటర్లు చాలా సులభంగా ఆడియన్స్ తో ఎంగేజ్ కావచ్చు.

ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయి.టెస్టింగ్ అనంతరం ముందుగా కొంత మంది సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది.

ఆ తరువాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తే యాక్సెస్ ఉన్నవారికి ఐడెంటిఫై చేసేలా స్టాక్ ఐకాన్ కనిపిస్తుంది.

యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రైబర్స్ లకు మాత్రమే కాకుండా అందరు యాక్సెస్ చేసుకోవచ్చు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు