తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో మరో ఇద్దరికి చోటు దక్కింది.ఈ మేరకు కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, షబ్బీర్ అలీకి కమిటీలో స్థానం లభించింది.
తాజాగా ఇద్దరికి చోటు దక్కడంతో స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ తో కలిసి మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు.కాగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది.
అతి త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది.అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా ఇటీవలే స్క్రీనింగ్ కమిటీలోకి ఇద్దరు సీనియర్ నేతలకు అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీలకు కమిటీలో స్థానం కల్పించింది.







