మన ఆడవారికి చీరలంటే ఎంత మక్కువో ప్రేత్యేకించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు.ఒక్కసారి షాపులోకి వెళ్ళాక, ఒక చీర( Saree ) నచ్చిందంటే ఎంత వెచ్చించైనా కొనడానికి సిద్ధపడతారు.
ఆఖరికి మొగుణ్ణి తాకట్టు పెట్టైనా సరే వారు నచ్చిన చీరను కొనేదాకా నిద్రపట్టారు.అయితే అదే షాపులో ఒకే చీరపైన ఇద్దరు మహిళల కన్నుపడితే ఇంకేమైనా వుంటుందా? చుట్టూ ఎంతమందున్నా రచ్చ రచ్చ చేస్తారు.తాజాగా చీరల డిస్కౌంట్ సేల్ కి( Discount Sale ) వెళ్లిన ఇద్దరు మహిళలు.ఒకే చీరను ఇష్టపడ్డారు.దాంతో ఆ చీర నాదంటే.నాదంటూ.
ఇద్దరు మగువలు అందరిముందే కుస్తీ పట్టారు.
కాగా ఆ ఇద్దరు మహిళల మధ్య చీర విషయంలో తలెత్తిన గొడవ కాస్త ఆఖరికి కొట్టుకునే వరకు దారితీయడం కొసమెరుపు.ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని ( Bangalore ) మల్లేశ్వరంలో జరగగా తాజాగా వెలుగు చూసింది.మైసూర్ సిల్క్స్ శారీ సెంటర్ ఇటీవల వార్షిక డిస్కౌంట్ సేల్ నిర్వహించింది.
భారీగా డిస్కౌంట్లు ఉండటంతో చీరల కోసం మగువలు ఆ షాపుకు పోటెత్తారు.ఈ సమయంలో ఓ చీరను ఇద్దరు మహిళలు ఇష్టపడ్డారు.
ఆ చీర నాదంటే.నాదంటూ ఇద్దరు మహిళలు గొడవపడ్డారు.
ఆ తర్వాత సహనం కోల్పోయిన ఆ మహిళలు దుకాణం లోపలే జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.మైసూర్ సిల్క్స్ స్టోర్‌లో ఒకరినొకరు కొట్టుకుంటున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.ముష్టియుద్ధానికి దిగడంతో అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది వారిని విడదీసేందుకు ప్రయత్నించారు.అయినప్పటికీ.వినకుండా ఒకరినొకరు కొట్టుకుంటూనే కనిపంచారు.
ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.దీనిపై పలువురు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.