నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్..!!

ప్రస్తుతం ఒక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఒకరి జుట్టును ఒకరు లాగడం, తన్నుకోవడం వంటి షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

 Two Girl Students Fight On The Road Video Viral Details, Students, Girl Students-TeluguStop.com

పాఠశాలకు వెళ్తూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినులు ఇలా రోడ్డుపై అనాగరికులుగా కొట్టుకోవడం ఇప్పుడు అందరినీ చాలా ఆగ్రహానికి గురిచేస్తోంది.

వైరల్ వీడియో మధ్యలో ఒక మహిళా టీచర్ ఈ విద్యార్థినుల మధ్యకు రావడం, వారి కొట్లాటను ఆపేందుకు ప్రయత్నించడం గమనించవచ్చు.అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇద్దరూ బాగా కొట్టేసుకున్నారు.

వీరి కొట్లాటను అందరూ చూసేశారు.కాగా ఈ గొడవ వీడియో చూసిన వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇద్దరు విద్యార్థులు ప్రదర్శించిన ఈ ప్రవర్తన ఏమాత్రం అంగీకరించదగినది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఈ రకమైన ప్రవర్తన ఉన్న వారి వల్ల పాఠశాల మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని, అలాగే ఇతరులు కూడా వీరిని చూసి ఇలా తయారవుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇటువంటి సంఘటనలు పాఠశాల ప్రతిష్టను కూడా దెబ్బతీస్తాయి.విద్యార్థులు, సిబ్బందికి అసురక్షిత ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని అంటున్నారు.

అందువల్ల, పాఠశాలలు ఈ రకమైన ప్రవర్తనను విద్యార్థినులలో మార్చడానికి తక్షణ చర్య తీసుకోవడం ముఖ్యం.అలాగే విద్యార్థులు అహింస, ఇతరుల పట్ల చూపించాల్సిన గౌరవం ప్రాముఖ్యతను అర్థం చేసుకునేలా చేయడం అత్యవసరం.

నిజానికి ఇతర ఘటనలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి.ఈరోజుల్లో అమ్మాయిలు అబ్బాయిల వలె కొట్లాడి కోవడానికి కూడా తెగబడటం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube