వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు పరాయి గడ్డ మీద కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లోని రాజకీయాల్లో భారతీయుల ఆధిపత్యం నానాటీకి పెరుగుతోంది.
తాజాగా మనకు చిరకాల మిత్రదేశమైన రష్యా రాజకీయాల్లోనూ ఇప్పుడిప్పుడే భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది.ఇటీవల పశ్చిమ రష్యాలోని కుర్స్క్‌లో భారతీయుడు చరిత్ర సృష్టించాడు.భారత సంతతికి చెందిన అభయ్ కుమార్ సింగ్ ఇక్కడి చట్టసభకు ఎన్నికయ్యారు.2017, 2022లో ఆయన వరుసగా రెండుసార్లు డెప్యూటట్ (భారతదేశంలో ఒక ఎమ్మెల్యే పదవితో సమానం)గా ఎన్నికయ్యారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీలో అభయ్ సభ్యుడు.అమెరికా డ్రీమ్స్ మాదిరే రష్యాలోనూ అసాధ్యం కానిది ఏదీ లేదని సింగ్ నిరూపించారు.

భారత్‌లోని బీహార్‌కు చెందిన అభయ్ కుమార్ సింగ్ 1991లో మెడిసిన్ చదివేందుకు అప్పటి సోవియట్ యూనియన్‌కు వచ్చారు.అయితే నెపోలియన్, హిట్లర్ వంటి చారిత్రాత్మక వ్యక్తుల్నే భయపెట్టిన రష్యా వింటర్ సీజన్ .అభయ్‌ను కూడా వణికించింది.దీంతో తాను ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పాడు.
కుర్స్క్‌లో ఉష్ణోగ్రతలు -25 నుంచి -30కి తగ్గుతాయి.దీనికి తోడు భాష ఎల్లప్పుడూ అడ్డంకిగా వుంటుంది.
ఈ సమయంలో తనకు ఎలెనా అనే డీన్ ఎంతో సాయం చేశారని అభయ్ గుర్తుచేసుకున్నారు.ఆమె తన తల్లి లాంటిదని, ఒక నెల పాటు ఆశ్రయం ఇచ్చారని తెలిపారు.

ఆ సమయంలో భారతదేశం సరళీకరణ దిశగా అడుగులు వేస్తోందని.అప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ వున్నారు.భారత్‌కు దశాబ్ధాల నుంచి మిత్రదేశంగా వున్న అప్పటి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయమని, దీనికి తోడు ఇండియాలోనూ ఆర్ధిక సంక్షోభం వుందని అభయ్ గుర్తుచేసుకున్నాడు.పుతిన్ వచ్చిన తర్వాత.
తన కళ్లముందే మార్పు స్పష్టంగా కనిపించిందని ఆయన ప్రశంసించారు.







