వావ్, ఈ యువకుల ఫైటింగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి..!

ఈరోజుల్లో స్కూల్‌కి, కాలేజీకి వెళ్లే కుర్రాళ్ళు ( Boys ) ఒకరికొకరు బాగా కొట్టుకుంటున్నారు.కొందరు ఛాలెంజ్‌లు విసురుకొని మరీ ఫిస్ట్ ఫైటింగ్స్‌కి( Fist Fightings ) దిగుతున్నారు.

 Two Boys Fist Fighting Video Viral On Social Media Details, Fight Videos, Street-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారుతున్నాయి.ఫెయిర్ ఫైట్స్‌కి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఆకట్టుకుంటుంటాయి.

తాజాగా అలాంటి ఓ ఫైట్ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఇద్దరు యువకులు వాష్ రూమ్ లోకి వెళ్లి చాలా బలంగా పంచులు విసురుకుంటూ ఫైటింగ్ చేశారు.

పొడవాటి జుట్టు ఉన్న ఒక యువకుడు మొదట బాగానే పంచల వర్షం కురిపించాడు కానీ తర్వాత అతడి పిడుగుద్దులన్నీ మిస్ అయ్యాయి.అవతలి వైపు ఉన్న ఈ యువకుడు కచ్చితత్వంతో దౌడల మీద బలంగా పంచ్‌లు( Punches ) ఇవ్వగలిగాడు.రెండు, మూడు పంచులు బలంగా తగలడంతో పొడవాటి జుట్టు ఉన్న యువకుడు కింద పడిపోయాడు.ఒకసారి కింద పడి లేవ గలిగాడు, కానీ తర్వాత ఇంకొక పంచ్ విసరగానే అతడు నేలకూలాడు.

అనంతరం ఈ ఫైట్ లో గెలిచిన యువకుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

దీనిని కొందరు ఫ్రెండ్స్ వీడియో రికార్డ్ చేశారు.ఈ ఫైట్ కాస్త భయంకరంగా కూడా అనిపించింది.చాలా వేగంగా బలంగా గుద్దుకుంటున్న పంచ్‌ల వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

అదృష్టవశాత్తు, యువకుడు ఈ ఫైట్‌లో నాకౌట్‌( Knockout ) అయ్యాడే తప్ప చనిపోలేదు.@streetfighthard ట్విట్టర్ పేజీ ఈ ఫైట్ వీడియోను షేర్ చేసింది దీనికి ఇప్పటికే 14 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వెరీ ఫెయిర్ ఫైట్, చాలా బాగా ఆడారు అని దీని కింద నెటిజన్లు కామెంట్లు చేశారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube