సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దేవర,వార్2 అప్డేట్స్.. అవేంటంటే?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర ( Devara )సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఇండియా స్టార్ గా మారారు జూనియర్ ఎన్టీఆర్.

 Two Big Updates From Ntr Upcoming Films Devara And War2, Ntr, Devara, War2, Big-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలపై భారీగా అంచనాలు ఉన్నాయి.ఇక అందుకు తగట్టుగానే ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి.

కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దేవర మూవీలో నటిస్తున్నారు.

Telugu Big Ups, Devara, Bigups, War-Movie

అలాగే బాలీవుడ్ మూవీ వార్ 2( War 2 ) లోనూ నటిస్తున్నారు.ఈ మూవీ తోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్.మరోవైపు డైరెక్టర్ తో ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న వార్2, దేవర( War2, Devara ) సినిమాల నుంచి అభిమానులకు బిగ్ అప్డేట్స్ అందాయి.

దేవర చిత్రంలో మాస్ ఐటెం సాంగ్ రూపుదిద్దుకుంటోందని త్వరలోనే అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

నీటి అడుగున సాగే భారీ యాక్షన్ సీన్ ను కూడా యూనిట్ పూర్తి చేసుకుంటోంది.ఇదివరకే భారీ షిప్ సెట్ లో, కీలక సన్నివేశాలు అలాగే ఒక సాంగ్ ను షూట్ చేశారు.

Telugu Big Ups, Devara, Bigups, War-Movie

ఈ క్రమంలో నెక్ట్స్ మాస్ ఐటెమ్ సాంగ్ పై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.వార్ 2 సినిమా విషయానికి వస్తే.ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తలపడబోతున్నారు.యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకోనుంది.ఆయాన్ ముఖర్జి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే అయాన్ ముఖర్జి ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది.

ప్రీ ప్రిడక్షన్ పనులు ప్రారంభించేందు కోసం తారక్ ను మీట్ అయ్యారట.అతి త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

ఇదే విషయంపై ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా వార్2 పై స్పందించారు.అలాగే ఈరోజే అదుర్స్ రీరిలీజ్ డేట్ నూ అనౌన్స్ చేశారు.

నవంబర్ 18న మళ్లీ థియేటర్లోకి రాబోతున్నట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube