ఆ పిల్లలకు అరుదైన వ్యాధే అందాన్ని తెచ్చిపెట్టిందట.. మీరూ చూడండి!

ఎవరికైనా వ్యాధి సోకితే… దాని రకాన్ని బట్టి కాళ్ల నొప్పులో, చేతి నొప్పులో, కడుపు నొప్పో, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు వస్తాయి.దీని వల్ల వ్యాధి సోకిన వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 Two Babies Suffering From Uncombable Hair Syndome , Rare Disease, Uhs Dieseace,-TeluguStop.com

వారని బాగా చూసుకోవడంతో పాటు వారు నొప్పితో విలవిల్లాడినప్పడుల్లా బాధ కూడా పడాల్సి వస్తుంది.అయితే కానీ ఓ పాపకి సోకిన అరుదైన వ్యాధి అందర్నీ ఆనందానికి గురి చేస్తుంది.

అదేంటీ అలా ఎందుకు అనుకుంటున్నారా… అవునండి.ఎందుకంటే ఆ పాపకు సోకిన వ్యాధి వల్ల మరింత అందంగా తయారైంది.

చూసేందుకు చాలా స్టైలిష్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి అయిన అన్ కాంబెబుల్ హెయిర్ సిండ్రోమ్.

ఈ వ్యాధితో బాధపడేవారు ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే.ఉంటారు.

కానీ అదే వ్యాధి ఇద్దరు చిన్నారులకు మరింత ప్రత్యేకతను తెచ్చి పెట్టింది.

ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు నెట్టింటి చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయారు.2021లో డేవిడ్ అనే బాలుడు యూహెచ్ఎస్ వ్యాధితో జన్మించాడు.దీని వల్ల అతడి పొడవాటి కాపర్ కలర్ జుట్టుతో పుట్టాడు.

ఆ బాలుడిని వైద్యల వద్దకు తీసుకెళ్లగా ఇది అరుదైన వ్యాధి అని తెలిపారు.అయితే బాబును చూసిన వారంతా వింతగా, విచిత్రంగా చూసేవారు.

బాబు చూసేందుకు బాగున్నప్పటికీ… కొందరు నెగటివ్ కామెంట్లు కూడా చేసేవారట.తాజాగా ఇదే వ్యాధితో పుట్టిన మరో చిన్నారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెండి రంగులో జుట్టంతా గజిబిజిగా ఉంది.దువ్వుదామంటే కనీసం దువ్వెన కూడా పెట్టేందుకు వీలుండదు.

లైలా ఫొటోలు, వీడియోలను ఆమె తల్లి షార్లెట్ అన్ స్టాలో పోస్ట్ చేసింది.దీంతో అవి వైరల్ గా మారాయి.

అమ్మాయి చాలా బాగుందంటూ విపరీతమైన లైకులు, కామెంట్లు, వ్యూస్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube