దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్ీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది.మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజేశ్ జోషితో పాటు గౌతమ్ మల్హోత్రా బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో ఇద్దరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.మరోవైపు ఈనెల 10న మనీశ్ సిసోడియాపై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారించనుంది.







