హైదరాబాద్ లోని హైదర్ గూడలో చోటు చేసుకున్న జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది.కేసుపై ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు హత్యకు ప్రేమ వ్యవహారం కారణం కాదని నిర్ధారించారని తెలుస్తోంది.
రాహుల్ హత్యలో మొత్తం నలుగురు దుండగులు పాల్గొన్నట్లు గుర్తించారు.అయితే ఈ కేసులో ముందుగా ప్రియురాలే రాహుల్ ను హత్య చేయించిందని పోలీసులు భావించిన సంగతి తెలిసిందే.
గతంలో ఓ అమ్మాయిని ప్రేమించిన రాహుల్ సింగ్ విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నాడని, ఈ క్రమంలోనే వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.దీంతో రాహుల్ వద్ద నుంచి డబ్బులు లాగేందుకు ప్లాన్ చేసిన ప్రియురాలు బెదిరింపులకు గురి చేసిందని పోలీసులు వెల్లడించారు.
అయితే హత్యకు ప్రియురాలు కారణం కాదని భావిస్తున్న పోలీసులు మర్డర్ జరగడానికి గల కారణాలపై దర్యాప్తును వేగవంతం చేశారని సమాచారం.ఈ క్రమంలోనే నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.







