పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి వైష్ణవి.. ఆ ఫోటోను షేర్ చేస్తూ?

ప్రముఖ బుల్లితెర నటీమణులలో ఒకరైన వైష్ణవి రామిరెడ్డి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దేవత సీరియల్ ద్వారా వైష్ణవి ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడం జరిగింది.

పెళ్లి తర్వాత వైష్ణవి నటనకు గుడ్ బై చెప్పినా యూట్యూబ్ వీడియోల ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.కొన్ని వారాల క్రితం గర్భవతి అయినట్టు శుభవార్త చెప్పిన వైష్ణవి తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

కొన్ని వారాల క్రితం వైష్ణవి సీమంతానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.గతేడాది సురేష్ అనే వ్యక్తిని వైష్ణవి పెళ్లి చేసుకున్నారు.

వైష్ణవి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె సోదరుడు విజయ్ సింహా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ద్వారా వెల్లడించారు.ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో చిన్నారిపాదాల బ్లూ ప్రింట్ ను షేర్ చేస్తూ కొత్త ప్రపంచంలోకి స్వాగతం మామా అంటూ కామెంట్ చేశారు.

Advertisement

ఈ విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా వైష్ణవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వైష్ణవి రామిరెడ్డి రాబోయే రోజుల్లో మళ్లీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.వైష్ణవి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

వైష్ణవి కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వైష్ణవి రామిరెడ్డి సీరియల్ లో నటించే సమయంలో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని కామెంట్లు వినిపించాయి.వరుసగా బుల్లితెర ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఆమె బుల్లితెరకు దూరమయ్యారు.వైష్ణవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దేవత సీరియల్ సక్సెస్ సాధించడంలో వైష్ణవి కీలక పాత్ర పోషించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు