కార్తీకదీపంలోకి మోనిత రీ ఎంట్రీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు తెలివిజన్ చరిత్రలో నెం 1 సీరియల్ గా కోన సాగుతున్న విషయం తెలిసిందే.

 Tv Actress Shobha Shetty Aka Monitha Latest Video On Karthika Deepam Re Entry, K-TeluguStop.com

అయితే ఈ సీరియల్ లో కార్తీక్, దీప, మోనిత లు వెళ్ళిపోయిన తరవాత నెక్స్ట్ జనరేషన్ అంటూ కొత్త కొత్త వారిని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.అయితే కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న బ్రాండ్ వాల్యూతో ఈ సీరియల్ ప్రస్తుతానికి అయితే టాప్ రేటింగ్‌లోనే ఉంది.

అయితే దీప, కార్తీక్, మోనితలు ఉన్నప్పుడు వచ్చిన రేటింగ్‌లో కనీసం సగం కూడా సాధించలేకపోతుంది.

ఇదిలా ఉంటే కార్తీకదీపం సీరియల్ మళ్లీ తిరిగి పుంజుకోవాలి అంటే డాక్టర్ బాబు, దీపతో పాటుగా మోనిత కూడా రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అని కార్తీకదీపం సీరియల్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఒకవేళ ఆ ముగ్గురిని తీసుకు వచ్చే ఆలోచన ఉంటే ఎందుకు పంపిస్తారు.అంతేకాకుండా కార్తీక్,దీప క్యారెక్టర్లను చంపేశారు.కాబట్టి మళ్లీ వాళ్లు తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి లేదు అని చెప్పవచ్చు.ఇక మోనిత విషయానికి వస్తే మూవీ ఆమె జుట్టుకు తెల్లరంగు వేస్తే తప్ప పాత్ర పండదు.

అందువల్లే యంగ్ బ్యూటీ అయిన శోభా శెట్టి అలియాస్ మోనిత కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకుంది.ఇదిలా ఉంటే తాజాగా కార్తీకదీపం సీరియల్ సెట్ లో మోనిత ప్రత్యక్షమైంది.

మళ్లీ కార్తీకదీపం సీరియల్ కి వస్తాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది.స్టైలిష్ లుక్‌లో కార్తీకదీపం సెట్‌లో ఉన్న వాళ్లని సర్ ప్రైజ్ చేస్తూ హిమ, సౌర్యలకు షాక్ ఇచ్చింది.హిమకి నటనలో సలహాలు ఇచ్చి అనంతరం ఆమె నటనను తెగ పొగిడేసింది శోభ శెట్టి.ఆ తరువాత ప్రేమ్ దగ్గరకు వెళ్లగా ఎవరొచ్చారో తెలుసా? మా అత్తయ్య అంటూ ప్రేమ్ షాక్ ఇవ్వడంతో ఆ మాట వినగానే శోభా వీళ్లు నన్ను అత్తయ్య అంటారనే నేను సీరియల్‌లోకి రావాలి రీఎంట్రీకి అత్తయ్యగా వచ్చినా వీళ్లు అత్తయ్య అంటే నా పరిస్థితి ఏంటి? అందుకే చేయలేదు అని చెప్పేసింది శోభ.ఆ తరువాత అక్కడికి సౌందర్య రావడంతో ఆమెతో కలిసి కన్నడలో ముచ్చట్లు పెట్టింది శోభ.ఆ తరువాత సెట్‌లో ఉన్న వాళ్లందరితోనూ సరదాగా మాట్లాడింది.అదే సెట్‌లో కార్తీకదీపం నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు ఉండటంతో అతనితో కలిసి భోజనం చేసింది మోనిత.కార్తీకదీపం సెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపంకి మళ్లీ వస్తున్నా అంటూ తంబ్ నెయిల్ పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube