నిన్ను చూడాలని నీ చేతి ముద్ద తినాలని ఉంది.. తల్లి మరణాన్ని తట్టుకోలేక నటి ఎమోషనల్!

తల్లిని మించిన దైవం ఉండదని పెద్దలు చెబుతారు.పిల్లలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టం తీర్చడానికి ప్రయత్నించే వ్యక్తులలో తల్లి ముందువరసలో ఉంటారు.

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా తమిళ బుల్లితెర నటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ బుల్లితెర నటి పవిత్ర లక్ష్మి( Actress Pavitra Lakshmi ) తల్లి కొన్నిరోజుల క్రితం మృతి చెందారు.

తల్లి మృతి( Pavitra Lakshmi Mother ) గురించి పవిత్ర స్పందిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.పవిత్ర తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో నువ్వు మమ్మల్ని విడిచి అప్పుడే ఏడు రోజులైందని ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నానని చెప్పుకొచ్చారు.

నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావడం లేదు అమ్మ అంటూ పవిత్ర లక్ష్మి షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

Advertisement

దాదాపుగా ఐదేళ్ల నుంచి నువ్వు అనుభవించిన బాధలు, కష్టాలు అక్కడ ఉండవని భావిస్తున్నానని పవిత్ర లక్ష్మి పేర్కొన్నారు.తన తల్లి సూపర్ మామ్ అని సింగిల్ పేరెంట్ గా ఉంటూ బిడ్డలను చూసుకోవడం తేలిక కాదని పవిత్ర లక్ష్మి వెల్లడించారు.నాకు నిన్ను ఒకసారి చూడాలని ఉందని నీతో మాట్లాడాలని ఉందని నీ చేతి ముద్దలు తినాలని ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని పవిత్ర లక్ష్మి అన్నారు.

తల్లి మృతిపై పవిత్ర లక్ష్మి ఎమోషనల్ కావడంతో పాటు ఈ పోస్ట్ చేసిన తీరును చూసి భగవంతుడు పవిత్ర లక్ష్మికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కామెంట్లు చేస్తున్నారు.పవిత్ర లక్ష్మి కెరీర్ పరంగా మరింత ఎదిగి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు