Motor Operating Device : బోర్ మోటర్ స్విచ్ ను మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేయొచ్చు.. ఎలా అంటే..?

స్టార్టప్ కంపెనీ ఓ సరికొత్త పరికరంను పొందించింది.ఈ పరికరం ద్వారా పొలంలో ఉండే బోర్ మోటార్ ను( Bore Motor ) మొబైల్ ఫోన్ సహాయంతో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు.

 Turn The Motor On And Off With This Startup Company Device-TeluguStop.com

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తోపాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది.వరి, మొక్కజొన్న, ఉల్లి, మిర్చి లాంటి పంటలకు సరైన సమయాల్లో నీటి తడులు అందించడం చాలా అవసరం.అయితే కొన్ని సందర్భాల్లో.పొలానికి వెళ్లి బోర్ మోటర్ ఆన్ చేయడం లేదంటే ఆఫ్ చేయడం కొన్నిసార్లు కుదరదు.రైతు ఏదైనా పనిమీద ఊరికి వెళితే వచ్చేలోపు పంట ఎండిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ.లేదంటే పనులన్నీ ఆపేసి పంటకు నీటి తడి అందించాల్సి ఉంటుంది.

Telugu Automatic, Bore, Farmers, Phone, Nyasta, Startup Company-Latest News - Te

ఈ సమస్యకు ఇక చెక్ పెట్టినట్టే.ఫోన్లో నెట్వర్క్ ఉంటే చాలు రైతు ఎంత దూరం నుంచైనా బోరు మోటర్ ఆన్ చేయవచ్చు, ఆఫ్ చేయవచ్చు.న్యాస్త( Nyasta ) అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో ఈ స్టార్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు( Farmers ) ఈ స్టార్టర్ ను మోటర్ వద్ద అమర్చుకోవాలి.

ఇక ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మోటర్ ఆఫ్ లేదా ఆన్ చేసుకోవచ్చు.మొబైల్ ఫోన్లో( Mobile Phone ) మాదిరిగానే ఈ స్టాటర్ లో కూడా ఒక సిమ్ కార్డు ఉంటుంది.

ఈ సిమ్ కార్డు ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.

Telugu Automatic, Bore, Farmers, Phone, Nyasta, Startup Company-Latest News - Te

అంటే మోటారుకు నీరు సరిగా అందుతుందా.లేదా, విద్యుత్ ఓల్టేజ్ ఎంత ఉంది.మోటర్ సరిగ్గా నీటిని ఎత్తిపోస్తుందా లేదా లాంటి సమాచారం అంతా ఎప్పటికప్పుడు రైతు మొబైల్ కు మెసేజ్ రూపంలో వస్తుంది.

సిమ్ కార్డుకు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది.ఫోన్ సిగ్నల్స్ ఉంటే ఎక్కడి నుంచైనా దీనిని ఆపరేట్ చేయొచ్చు.ఒకవేళ విద్యుత్ హెచ్చుతగ్గులు వచ్చినా లేదంటే బోర్ లో నీళ్లు లేకపోయినా మోటర్ ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుంది.ఆ సమాచారం కూడా రైతు మొబైల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో వస్తుంది.

ప్రతిరోజు ఒకే సమయంలో మోటార్ ఆన్ అయ్యేలా షెడ్యూల్ మోడ్ ఫిక్స్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube