Kokapet Jhansi: అప్పుడు ఝాన్సీ చెప్పిందే ఇప్పుడు నిజమైందా.. కోకాపేట ఆంటీ లెక్కలు నిజమేనంటూ?

విక్టరీ వెంకటేష్ నయనతార కలిసి నటించిన తులసి సినిమా( Tulasi Movie ) మనందరికీ గుర్తుండే ఉంటుంది.ముఖ్యంగా అందులో కోకాపేట ఆంటీ( Kokapet Aunty ) అంటూ యాంకర్ ఝాన్సీ చేసిన కామెడీ కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది.

 Tulasi Movie Kokapet Aunty Comedy Scene Viral After Kokapet Land Auction-TeluguStop.com

పట్టుచీర కట్టుకుని ఒంటినిండా నగలు వేసుకుని తను చాలా రిచ్‌ అని చెప్పకనే చెప్తుండేది.తులసి సినిమా చూసిన అందరికీ ఆమె ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.

అందులో ఆమె డైలాగ్ చెబుతూ కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడ పెట్టుకోవాలో తెలీనంత డబ్బు వచ్చింది.అందులకేంచి పది లక్షలు తీసి ఈ కోక, నగలన్నీ కొన్నడు మా ఆయన అని చెప్తుంది.

ఇప్పుడీ డైలాగ్‌ మరోసారి వైరల్ గా మారింది.

Telugu Jhansi, Kokapet Aunty, Kokapetaunty, Kokapet, Nayanthara, Tulasi, Venkate

అయితే అందుకు గల కారణం లేకపోలేదు.ఎందుకంటే ప్రస్తుతం కోకాపేటలో పెరిగిన భూమి ధరలు.హైదరాబాద్‌ శివారులో ఉన్న కోకాపేటలో( Kokapeta Lands ) భూముల ధర ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టిస్తున్నాయి.

ఎకరం ఏకంగా వంద కోట్లు దాటింది.అయితే కోకాపేట అంటే ఎప్పటినుంచో రిచ్‌ అంటూ తులసి సినిమాలోని ఝాన్సీ( Jhansi ) వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.

కోకాపేట ఆంటీ( Kokapeta Aunty ) చెప్పిందంటే అది నిజమే మరి, కోకాపేట అంటే మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే కోకాపేటలో రికార్డు ధరల విషయానికి వస్తే.

కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ భూములు అంచనాలకు మించి పలుకుతున్నాయి.

Telugu Jhansi, Kokapet Aunty, Kokapetaunty, Kokapet, Nayanthara, Tulasi, Venkate

నిధుల సమీకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ( HMDA ) గురువారం నాడు మరోసారి భూముల అమ్మక ప్రక్రియను చేపట్టింది.నియోపోలీస్‌ లే అవుట్‌లోని 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు గురువారం వేలం వేసింది.ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.60 ఎకరాలు ఉండగా.ఎకరాకి రూ.100.25 కోట్లు వేలంలో పలికింది.ఈ ఒక్క ప్లాట్‌కే రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది.ఇది హైదరాబాద్‌ చరిత్రలోనే అత్యధిక భూమి రేటుగా భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube