ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చిన ముగ్గురు విచారణకు హాజరుకాలేదని సిట్ న్యాయస్థానానికి తెలిపింది.
ఈ క్రమంలో సిట్ విచారణకు ముగ్గురు సహకరించడం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు.బీఎల్ సంతోష్ కు నోటీసులు అందాయని ఏజీ పేర్కొన్నారు.
దీంతో బీఎల్ సంతోష్ సిట్ విచారణకు హాజరు అవ్వాలని హైకోర్టు సూచించింది.సుప్రీంకోర్టు ఆదేశాలు, సిట్ విచారణపై రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.
అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.