చింత చిగురుతో చర్మానికి మెరుపు.. ఇలా వాడితే మస్తు బెనిఫిట్స్..!

చింతచిగురు( Tamarind Leaves ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.చింత చిగురుతో మన భారతీయులు రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.

చింతచిగురు పప్పు, చింత చిగురు చికెన్, చింత చిగురు మటన్ ఇండియాలో మోస్ట్ ఫేమస్ ఐటమ్స్.అలాగే ఆరోగ్యానికి చింతచిగురు ఎంతో మేలు చేస్తుంది.

చింతచిగురు లో ఉండే పోషకాలు వివిధ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.అంతేకాదండోయ్ చర్మ సౌందర్యాన్ని( Skin Beauty ) మెరుగుపరిచే సత్తా కూడా చింత చిగురుకు ఉంది.

ముఖ్యంగా చింత చిగురును ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మస్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

Try This Tamarind Leaves Mask For Glowing Skin Details, Glowing Skin, Tamarind
Advertisement
Try This Tamarind Leaves Mask For Glowing Skin Details, Glowing Skin, Tamarind

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చేతినిండా చింత చిగురు వేసుకోవాలి.అలాగే నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( Curd ) వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Try This Tamarind Leaves Mask For Glowing Skin Details, Glowing Skin, Tamarind

ఆ తర్వాత తడి వేళ్ళతో చర్మాన్ని రబ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు చింత చిగురుతో ఈ విధంగా ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.

చింత చిగురు లో ఉండే విటమిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.చర్మంపై మొండి మచ్చలు ఉంటే వాటిని తొలగిస్తాయి.చర్మానికి కొత్త మెరుపును అందిస్తాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అలాగే పెసర పిండి మృత కణాలను తొలగిస్తుంది.చ‌ర్మ ఛాయ‌ను పెంచుతుంది.

Advertisement

పెరుగు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.రోజ్ వాటర్ స్కిన్ ను గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.

కాబ‌ట్టి మచ్చలేని మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న చింత చిగురు రెమెడీని ఫాలో అవ్వండి.

తాజా వార్తలు