ట్రంప్ గాలి తీసేసిన ఫౌచీ..అనుకున్నట్టే చేసేశాడుగా..!!!

అమెరికా వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మృతుల సంఖ్య లక్షకి చేరువలో ఉంది.

బాధితులు లక్షల్లో ఉన్నారు.మరో పక్క కరోనాపై అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇది కేవలం ట్రంప్ నిలక్ష్యంవలనే జరిగిందని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఇది కేవలం చైనా ప్రయోగించిన బయో వార్ లో భాగమే అంటున్నారు.ట్రంప్ కూడా కరోనా వైరస్ చైనా సృష్టేనని అక్కడి వ్యూహాన్ ల్యాబ్ లో ఈ మహమ్మారిని తయారు చేశారని ట్రంప్ ప్రతీ మీడియా సమావేశంలో ప్రకటిస్తున్నారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలు నిజమైనవి కావు అన్నట్టుగా అమెరికా జాతీయ అంటూ వ్యాధుల సంస్థకి డైరెక్టర్ అయిన ఫౌచీ ఓ బాబు పేల్చారు.అసలు కరోనా చైనా ల్యాబ్ లో పుట్టలేదని ఈ వైరస్ కి చైనా కి సంభంధం లేదని తేల్చి చెప్పేశారు.

Advertisement

ప్రస్తుతం ఫౌచీ అమెరికా కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా కీలక పదవిలో ఉన్నారు.అంతేకాదు సైంటిఫిక్ ఫేస్ ఆఫ్ అమెరికా అనే కీర్తిని కూడా గడించారు.

దాంతో ఇప్పుడు ఫౌచీ వ్యాఖ్యలపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.ట్రంప్ కి ఫౌచీ కి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటినుంచే ఎడమొఖం పెడ మొఖం గానే ఉంది.

ఫౌచీ ముందు నుంచీ ఈ వ్యాధి తీవ్రతపై అమెరికాని హెచ్చరిస్తూనే ఉన్నా ట్రంప్ కేవలం ఆర్ధిక వ్యవస్థపైనే దృష్టి పెట్టారని ఫౌచీ ఎన్నో సార్లు వాదించారు.కానీ తాజాగా చైనా కి ఈ వైరస్ కి సంభంధం లేదని చెప్పడంతో ట్రంప్ ని పూర్తిగా ఇరకాటంలో పెట్టేశారు.

ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫౌచీ సాధారణ వ్యక్తి కాదని అమెరికా వ్యాప్తంగా అతడి మాటలపై ప్రజలు నమ్మకాని ఉంచుతారని అంటున్నారు విశ్లేషకులు.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..
Advertisement

తాజా వార్తలు