అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఆ దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య అక్రమ వలసలు.ఈ అక్రమ వలసల కారణంగా ఎంతో మంది అమెరికన్లు నష్టపోతున్నారు అనేది వారి వాదన.
అందుకుగాను మెక్సికో తీరం వెంబడి సరిహద్దు గోడ నిర్మిస్తానని ట్రంప్ చెప్పడం , డెమోక్రాటిక్ పార్టీ గోడ నిర్మాణానికి ససేమిరా అనడం అందరికి తెలిసిందే.దాదాపు 35 రోజులు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ని ఎదుర్కుంది.
అయితే గోడ నిర్మాణం తప్పకుండా అవసరం అని కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ట్రంప్ తెగేసి చెప్పారు.ట్రంప్ మాట్లాడుతూ గతంలో ఈ సభలో ఉన్న చాలా మంది గోడ నిర్మాణానికి ఒప్పుకోలేదని ,అందుకే గోడ నిర్మాణం జరగలేదని అన్నారు.అయితే ఎత్తి పరిస్థితిల్లో గోడ నిర్మాణం జరిగి తీరుతుందని తెలిపారు.
ఇదే సభలో ప్రధాన డెమొక్రటిక్ అడ్వైజరీ, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా ఉన్నారు.అయితే ట్రంప్ ముందు కొంచం మెల్లగానే మాట్లాడినా, ట్రంప్ ఆ తరువాత గోడ నిర్మాణం పై గట్టిగానే పట్టు పట్టారు.మొత్తానికి గోడ నిర్మాణంలో ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితిలు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి.
తాజా వార్తలు