పట్టిన పట్టు విడువని ట్రంప్..!!!
TeluguStop.com
అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఆ దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య అక్రమ వలసలు.
ఈ అక్రమ వలసల కారణంగా ఎంతో మంది అమెరికన్లు నష్టపోతున్నారు అనేది వారి వాదన.
అందుకుగాను మెక్సికో తీరం వెంబడి సరిహద్దు గోడ నిర్మిస్తానని ట్రంప్ చెప్పడం , డెమోక్రాటిక్ పార్టీ గోడ నిర్మాణానికి ససేమిరా అనడం అందరికి తెలిసిందే.
దాదాపు 35 రోజులు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ని ఎదుర్కుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే గోడ నిర్మాణం తప్పకుండా అవసరం అని కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ట్రంప్ తెగేసి చెప్పారు.
ట్రంప్ మాట్లాడుతూ గతంలో ఈ సభలో ఉన్న చాలా మంది గోడ నిర్మాణానికి ఒప్పుకోలేదని ,అందుకే గోడ నిర్మాణం జరగలేదని అన్నారు.
అయితే ఎత్తి పరిస్థితిల్లో గోడ నిర్మాణం జరిగి తీరుతుందని తెలిపారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇదే సభలో ప్రధాన డెమొక్రటిక్ అడ్వైజరీ, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా ఉన్నారు.
అయితే ట్రంప్ ముందు కొంచం మెల్లగానే మాట్లాడినా, ట్రంప్ ఆ తరువాత గోడ నిర్మాణం పై గట్టిగానే పట్టు పట్టారు.
మొత్తానికి గోడ నిర్మాణంలో ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితిలు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి.
సెకండ్ హ్యాండ్ షాపులో రూ.415 పెట్టి ప్లేటు కొన్నాడు.. ఇంటికి వెళ్లేసరికి లక్షాధికారి?