తెలంగాణ రాజకీయాలు ఎన్నికలు రాకముందే అనధికారిక ఎన్నికల వాతావరణం అనేది నెలకొందని చెప్పవచ్చు.ఇక యాసంగి పంట కంటే ముందు పెద్ద ఎత్తున వరి పంట కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలడం రైతుల సమస్య రాజకీయ రంగు పులుముకోవడం లాంటి విషయాలు జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఇక గతంలోనే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పడంతో ఇక ప్రభుత్వం కూడా వరి పంట కాక ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని రైతులకు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ సూచనలు ఏమీ ఫలించినట్లు మనకు కనిపించడం లేదు. దీంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున వరి ధాన్యం సాగవడంతో ఇక ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వబోతుండటంతో ఇక రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు.
అయితే ఇక మరికొద్ది రోజుల్లో మంత్రులతో కలిసి కెసీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నం చేయనున్న నేపథ్యంలో పర్యటన ముగిసి తెలంగాణకు వచ్చాక భవిష్యత్ కార్యాచరణను కెసీఆర్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

అయితే టీఆర్ఎస్ పార్టీ నిరసనలతో కేంద్రం దిగిరాకపోతే ఇక మరో ఉద్యమ తరహా కార్యాచరణను కెసీఆర్ ప్రకటించడమే కాకుండా ఎట్టకేలకు బీజేపీని దోషిగా చూపి ప్రభుత్వం నుండి సానుకూల స్పందనను వ్యక్తం చేసి రైతులకు ఊరటనిచ్చే ప్రకటన చేసే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఎంత మేరకు కెసీఆర్ తన వ్యూహాన్ని విజయవంతమయ్యేంతలా ముందుకు తీసుకెళ్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం రైతుల ప్రయోజనాలే మా ప్రధాన ఎజెండా అని ఖరాఖండీగా చెబుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.







