కుడితిలో పడ్డ ఆ నేత.. ఇప్పుడు గిలగిలలాడుతున్నాడు

ఓడలు బళ్లు అవ్వడం .బళ్లు ఓడలు అవ్వడం రాజకీయాల్లో షరా మాములే! రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి స్థానం ఎలా ఉంటుందో చెప్పలేము.

కానీ ఇక్కడ అధికారం ఉన్నవాడిదే రాజ్యం వారికే సకల మర్యాదలు ఉంటాయి.కానీ ప్రస్తుత గ్రూపు రాజకీయాల్లో నాయకుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం.

ఇప్పుడు ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నాడు రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా పేరున్న ధర్మపురి శ్రీనివాస్ ( డీఎస్ ) .ఆయనకు సొంత పార్టీ టీఆర్ఎస్ అధినాయకులు పొమ్మనలేక పొగ పెట్టడం ఆయన రాజకీయ భవిష్యత్తుని అగాధంలోకి నెట్టేస్తోంది.పోనీ తన పాత పార్టీ కాంగ్రెస్ గూటికి వెళదాం అంటే అక్కడ ప్రస్తుతం ఉన్న నాయకులు అడ్డుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయన పరిస్థితి ఏంటో అర్ధం కాక ఆయన తీవ్ర గందరగోళంలో ఉన్నాడు.ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

Advertisement

కాంగ్రెస్ నుంచి డీఎస్ టీఆర్ఎస్ లో చేరాక కొన్నిరోజుల వరకు డీఎస్ కు పార్టీలో బాగానే ప్రాధాన్యత ఇచ్చారు.రాజ్యసభకు కూడా పంపించారు.అయితే, డీఎస్ చిన్న కుమారుడు అరవింద్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరాక డీఎస్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది.

కేసీఆర్ కుమార్తె కవితపై అరవింద్ బీజేపీ తరుపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు.ఆయన చాలా చురుగ్గా నియోజకవర్గంలో తిరుగుతూ కవితకు రోజురోజుకూ బలమైన ప్రత్యర్థిగా తయారవుతున్నారు.

అయితే, కుమారుడికి సహకరిస్తున్నారని, పార్టీ నేతలను కుమారుడి వైపు పంపిస్తున్నారని ఆరోపిస్తూ డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కవిత సహా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ కి ఫిర్యాదు అందించారు.

కేసీఆర్ కూడా డీఎస్ విషయంలో ఆగ్రహంగానే ఉన్నారు.ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు డీఎస్.కానీ, నెల రోజులు గడుస్తున్నా డీఎస్ కు అపాయింట్ మెంట్ దక్కలేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అలాగని ఆయన మీద చర్యలు కూడా తీసుకోలేదు.దీంతో డీఎస్ అసలు టీఆర్ఎస్ లో ఉన్నారా.? లేదా అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఆయనపై చర్యలు తీసుకుంటే బీసీపై చర్యలు తీసుకున్నారనే అపవాదు మూటగట్టుకోవడం ఇష్టంలేని టీఆర్ఎస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవడానికి మెుగ్గు చూపడం లేదు.

Advertisement

ఇదే సమయంలో డీఎస్ కూడా పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో ఆయన పార్టీలో ఉండలేక బయటకి వెళ్లలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు.ఇక ఆయనకు ఉన్న ఒకేఒక ఆప్షన్ బీజేపీ.

తాజా వార్తలు