రేవంత్ పై టీఆర్ఎస్ ఫోకస్...అలా జరగకూడదనేనా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతోంది.గత రెండు సార్వత్రిక ఎన్నికల ముందు కంటే  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజల్లో ఉంటూ ఎంతో కొంత బలపడింది.

అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తరువాత రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ తెలంగాణ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత తనదైన శైలిలో దూసుకపోతున్న పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ ను పటిష్ట పరచడం, తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ సైరన్ ల పేరిట ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతూ క్షేత్ర స్థాయి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్న పరిస్థితి ఉంది.అయితే రేవంత్ రెడ్డి దూకుడు ఇప్పుడు టీఆర్ఎస్ కు అతిపెద్ద అడ్డంకిగా మారింది.

Advertisement

అందుకే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతున్న పరిస్థితి ఉంది.

ఇక  కాంగ్రెస్ కు కూడా బలపడే అవకాశం ఇచ్చినట్లయితే ఇక టీఆర్ఎస్ కు గడ్డుకాలం మొదలైనట్టు మనం ఒక నిర్ధారణకు రావచ్చు.అందుకే తాజా పరిణామాలను కెసీఆర్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇప్పటికైతే టీఆర్ఎస్ అధిష్టానం పాలనపై మాత్రమే దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.కానీ రానున్న రోజుల్లో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పకడ్భందీ వ్యూహాలను రచించే అవకాశం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు