బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్

తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు.ఈ నేపథ్యంలో తీర్మానాన్ని ఆమోదిస్తూ సరిగ్గా 1.19 గంటలకు పత్రాలపై కేసీఆర్ సంతకం చేశారు.ఈ క్రమంలో జాతీయ పార్టీగా ఎందుకు మారాల్సి వచ్చిందో కేసీఆర్ వివరించారు.తెలంగాణ రాష్ట్ర సమితి.భారత్ రాష్ట్ర సమితిగా మారిందని ప్రకటించారు.ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడేఎస్ అధినేత దేవెగౌడ, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ సహా 283 ప్రతినిధులు హాజరైయ్యారు.

 Trs Became Brs-TeluguStop.com

దీంతో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.మరోవైపు పార్టీ ప్రతినిధుల బృందం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనుంది.

పార్టీ పేరు తీర్మానాన్ని రేపు ఈసీకి పార్టీ నేతలు అందించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube