రాజకీయ మేథావి.టీవీ చర్చల్లో కనిపించే నేతగా పేరున్న మాజీ ఎంపీ సబ్బం హరికి టీడీపీలో సెగ పెట్టేస్తున్నారా ? ఆయనకు ఉన్న పదవి నుంచి ఆయన్నే పీకించేలా తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే అవునన్న చర్చలే వినిపిస్తున్నాయి.ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.ఆ తర్వాత ఆయన భీమిలి వైపు చూడడమే మానేశారు.
ఏ పున్నమికో అమావాస్యకో సబ్బం హరి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు.
ఆయన తాజాగా వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఆయన్నే నమ్ముకుంటే భీమిలిలో వచ్చే ఎన్నికల వేళ కూడా పార్టీ బాగుపడదు సరిదా ? మళ్లీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు ఆ ఎఫెక్ట్ వైజాగ్ ఎంపీ సీటుపై కూడా పడుతుందని తమ్ముళ్లు వాపోతున్నారు.సబ్బంను భీమిలి ఇన్‌చార్జ్ పగ్గాల నుంచి తప్పించేసి ఆయన స్థానంలో మాజీ ఎంపీపీ, బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన కోరాడ రాజబాబుకు ఇంచార్జి పదవిని ఇవ్వాలని తమ్ముళ్ళు కోరుతున్నారుట.

ఆ మాటకు వస్తే భీమిలి నియోజకవర్గంలో కాపుల ఓటర్లే ఎక్కువ.గత నాలుగు ఎన్నికల్లోనూ ఈ వర్గం వారే ఎక్కువుగా గెలుస్తూ వస్తున్నారు.దీంతో ఇప్పుడు అక్కడ పార్టీ పగ్గాలు కాపులకే ఇవ్వాలంటున్నారు.అలాగే ఈ పదవి కోసం భీమిలీ పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ గంటా నూకరాజు పేరు కూడా వినిపిస్తోంది.
ఏదేమైనా సబ్బం ఊక దంపుడు ఉపన్యాసాలు.టీవీ చర్చలతో విసిగి పోయిన తెలుగు తమ్ముళ్లు ఆయన్ను భీమిలి నుంచి సాగనంపేందుకు డిసైడ్ అయినట్టే కనపడుతోంది.
మరి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.