సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి చెందిన నటీనటులను బాగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.ఏదో ఒక విషయంలో నటీనటులపై మీమ్స్ క్రియేట్ చేసి బాగా వైరల్ గా మారుస్తూ ఉంటారు.
నిజానికి ఎప్పుడెప్పుడు వారిపై ట్రోల్స్ వేద్దామా అని ఎదురు చూస్తుంటారు.అంతేకాకుండా వారు నటించిన సినిమాలలో ఏదైనా పొరపాటు కనిపిస్తే చాలు వెంటనే దానిని ట్రోల్ చేస్తుంటారు.
దీంతో ఈ ట్రోల్స్ ను చాలా మంది నటీనటులు అస్సలు పట్టించుకోరు.కానీ కొందరు మాత్రం పట్టించుకుంటే ఆ ట్రోలర్స్ ను అస్సలు వదలరు.కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ల బాడీ షేమింగ్ పై, హీరోల లుక్ లపై, వారి వ్యక్తిగత విషయాలపై కూడా కామెంట్లు, ట్రోల్స్ చేస్తుంటారు.నిజానికి ఈ ట్రోల్ చేసేవాళ్లు.
ఎవరో ఉండరు.ఎవరైతే ఆ హీరోకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్లే ఈ ట్రోల్స్ చేసి బాగా వైరల్ చేస్తుంటారు.
ఇప్పుడు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయంపై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.
స్టార్ నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.సహాయం చేసే వ్యక్తిగా జనాల హృదయాల్లో నిలిచాడు.
రాజకీయపరంగా సొంతంగా పార్టీ పెట్టి ప్రజలను పాలించడానికి ముందుకొచ్చాడు.ఇక పవన్ కు మూడు పెళ్లిళ్లు జరిగిన విషయం అందరికీ తెలుసు.

పవన్ వ్యక్తిగత విషయంలో ఈ మూడు పెళ్లిళ్లు బాగా హాట్ టాపిక్ గా మారాయి.ఈయన శత్రువులు మాత్రం ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఆయనను చాలా సార్లు విమర్శించారు.అయినా కూడా పవన్ ఏ రోజు ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో బాధపడలేదు.గతంలో పవన్ తన పార్టీ తరపున సభలో పాల్గొన్నాడు.కొన్ని వ్యక్తిగత విషయాలను బయటికి కూడా తెలిపాడు.కొందరి రాజకీయ నాయకుల పేర్లను తీస్తూ తమ ఇష్టానికి తన వ్యక్తిగత విషయాలను విమర్శించారంటూ.
కానీ మీ అందరితో పోల్చుకుంటే తన వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైనదని తెలిపాడు.
మీలాగా నేను వ్యక్తిగత విషయాలను దాచుకోనంటూ.
విమర్శించుకోండి, చీదరించుకోండి కానీ బయట, లోపల వేరుగా కనిపించే వ్యక్తిని కాదని తెలిపాడు.ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి అడిగితే మూడు పెళ్లిళ్ల గురించి చర్చలు చేస్తారని తెలిపాడు.
అంతేకానీ మీలా ఒక పెళ్లి చేసుకొని బలాదూర్ గా తిరిగే వ్యక్తిని కాదంటూ.నా కర్మ.
నాకు కుదరలేదు.మంచో చెడో జరిగిపోయింది అంతేకానీ.
వొళ్ళు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు అంటూ ఫైర్ అయ్యాడు.

అయినా కూడా ఆయన భార్యల మీద ట్రోల్స్ వస్తూనే ఉంటాయి.ఇక పవన్ రాజకీయపరంగా ఎన్నో స్పీచ్ లు ఇస్తూ ఉంటాడు.అందులో ఆయన కులం, మతం, ప్రాంతం అంటూ స్పీచ్ ఇవ్వగా దానిపై బాగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక కులం, మతం, ప్రాంతం అంటే ఇవేనేమో అని ఆయన ముగ్గురు భార్యలను ఉద్దేశిస్తూ బాగా ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ ట్రోల్ బాగా వైరల్ అవుతుంది.







