‘అఖండ’( Akhanda ) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయాపాటి శ్రీను హీరో రామ్ తో( Ram Pothineni ) స్కంద( Skanda Movie ) అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 15 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మరియు టీజర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.దీనికి సంబంధించి ఒక గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ( Skanda Trailer Launch ) హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ఏర్పాటు చేసారు.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.

ఈ ఈవెంట్ లో బాలయ్య( Balakrishna ) ప్రసంగం ప్రారంభం నుండి చివరి వరకు నెటిజెన్స్ కి చాలా తేడాగా ప్రవర్తించాడు అని అనిపించింది.హీరో రామ్ మాట్లాడిన మామూలు స్పీచ్ కి కూడా బాలయ్య ఇచ్చిన రియాక్షన్స్ పై సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వినిపిస్తున్నాయి.ఇక ఆయన ప్రసంగాలు మొదటి నుండే చాలా మందికి అర్థం కావు, స్పీడ్ బ్రేకర్స్ పడుతూనే ఉంటాయి.నిన్న అయితే ఆ ప్రసంగం ఎటు నుండి ప్రారంభం అయ్యి , ఎటు వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు , పోనీ చిన్న నిడివి ఉన్న ప్రసంగాలు అయితే అనుకోవచ్చు, సుమారుగా 20 నిమిషాల నిడివి ఉన్న ప్రసంగం అది.దాని మీద సోషల్ మీడియా లో వచ్చిన ట్రోల్ల్స్ అన్నీ ఇన్ని కావు, బాలయ్య బాబు తాగేసి వచ్చాడని, అందుకే ఇలా ఈరోజు తేడాగా ప్రవర్తించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముఖ్యంగా హీరో రామ్ ని బూతులు తిడుతూ మాట్లాడడం , ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా బాగా ఇబ్బందిగా అనిపించింది.బాలయ్య రామ్ తో ప్రవర్తించిన తీరు చనువు కొద్దీ, కాసేపు సరదాగా చేసి ఉండొచ్చు, కానీ అది చూసేవారికి ఈయనకి ఎదో తేడా కొట్టేసింది అని అనుకుంటూ ఉంటారు.బాలయ్య బాబు కి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’( Unstoppable With NBK ) అనే టాక్ షో ద్వారా మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ షో లో బాలయ్య బాబు ప్రతీ సెలబ్రిటీ తో ఎంతో సరదాగా మాట్లాడుతూ అల్లరి చేసాడు.ఆయన హోస్టింగ్ స్కిల్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి, అయితే అదంతా స్క్రిప్ట్ అని, బాలయ్య బాబు ఒరిజినల్ ఇది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.







