యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా తాజాగా టీజర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు.
టీజర్ విడుదలకు ముందు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వారు ఇప్పుడు పెదవి విరుస్తున్నారు.ఇది రామాయణం అంటూ ప్రకటించి రామాయణంలోని పాత్రలను రకరకాలుగా చూపించి రామాయణంలో అవహేళన చేస్తున్నారు అంటూ హిందూలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారంటే ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ సినిమాలో రావణాసురుడు పాత్ర మరియు హనుమంతుడి పాత్ర విషయంలో చాలా అపోహలు మరియు అనుమానాలు ఉన్నాయి.వీరిద్దరిని చూస్తుంటే ఒక హిందూ పురాణాలకు సంబంధించిన సినిమాలు చూస్తున్నట్లుగా లేదని వీరిద్దరూ ముస్లింలు గా ఉన్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.వీరిద్దరి పాత్రలు సినిమాలో అలాగే ఉంటే మాత్రం కచ్చితంగా బ్యాన్ చేసి తీరాల్సిందే అంటూ ప్రేక్షకులు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాలో సినిమాకు సంబంధించిన వ్యతిరేక వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ఆ రెండు పాత్రలను తొలగించడం ఎంత వరకు సాధ్యం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సినిమా దాదాపుగా పూర్తి అయింది.
విడుదలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో ఆ రెండు ముఖ్యమైన పాత్రలను మార్చడం లేదా తొలగించడం అసాధ్యం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారట.ఆ రెండు పాత్రలను అలాగే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సి వస్తుందేమో అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.