టాలీవుడ్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యింది.గతంలో పలు విషయాలతో వివాదాస్పదం అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఈసారి ఒక వ్యక్తి అమ్మను దూషించడం వల్ల అందరితో తిట్లు తింటోంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.కారు దిగుతుండగా తీసిన ఆ ఫొటోల్లో కొన్ని ఫొటోలను చూడగానే రకుల్ కింద ఏమీ ఏసుకోలేదా అనేలా అనిపించింది.
ఆమె కింది స్కర్ట్ మరీ చిన్నగా ఉండటం వల్ల వేసుకోనట్లుగానే అనిపించింది.దాంతో ఆమె ఫొటోలకు రక రకాలుగా కామెంట్స్ వచ్చాయి.
సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫొటోలకు పిచ్చి కామెంట్స్ రావడం చాలా కామన్.

ఆ పిచ్చి కామెంట్స్ ను పట్టించుకోకుండా వెళ్లడం ఉత్తమం.కాని ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తనను ఒక వ్యక్తి చేసిన కామెంట్‌కు స్పందించి అడ్డంగా బుక్ అయ్యింది.ఇంతకు ఆ వ్యక్తి ఏమన్నాడంటే.
కార్లో ఆ పని ముగించుకుని, ఆ తర్వాత పాయింట్ వేసుకోవడం మర్చి పోయి అలాగే దిగి పోయి ఉన్నట్లుంది అంటూ కామెంట్ చేశాడు.ఆ పని అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కార్లో ఎవరితోనో శృంగారం అనేది అతడి ఉద్దేశ్యం.అతడి వ్యాఖ్యలు మరీ నీచంగా ఉన్నాయి.
అయితే అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గురించి మాట్లాడితే ఆ వ్యాఖ్యలకు మరింతగా పబ్లిసిటీ ఇచ్చినట్లు అవుతుంది.కాని రకుల్ సైలెంట్ గా ఉండలేక పోయింది.

అతడి వ్యాఖ్యలకు బదులుగా అతడి తల్లిని ఈ గొడవలోకి లాగేసింది.మీ అమ్మ కూడా అలాంటి పనులు చేసి, కారు దిగి వచ్చినప్పుడు చూశావేమో, నీకు ఇలా అనిపించి ఉండవచ్చు.నీ తల్లి అలా అయితే నీవు ఇలా ఆలోచించావు అంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక నీచుడు చేసిన వ్యాఖ్యలకు అతడి తల్లిని ఇందులోకి తీసుకు రావడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో తాను అలాంటి వ్యాఖ్యలను చేసినట్లుగా రకుల్ సన్నిహితుల వద్ద వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.