త్రివిక్రమ్ ఆస్కార్ వరకు తనని తీసుకువెళ్తారు... తమన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోలింగ్!

చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు అందుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అయితే మన తెలుగు సినిమా ఇలా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు.అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఏకంగా ఆస్కార్ నామినేషన్లో నిలవడంతో తెలుగు ఇండస్ట్రీనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ఎంతో గర్విస్తోంది.

 Trivikram Will Take Him To The Oscars Netizens Are Trolling On Tamans Comments ,-TeluguStop.com

ఈ సినిమా నుంచి నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ఆస్కార్ నామినేషన్ లో నిలిచింది.

అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజ దర్శకులు ఉన్నప్పటికీ ఈ విజయం ఎవరి సొంతం కాలేకపోయింది.

ఇది కేవలం రాజమౌళి కీరవాణి ద్వయానికి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి.

Telugu Keeravani, Natu Natu, Oscar, Oscars, Rajamouli, Taman, Trivikram-Movie

ఇక ఈ విషయంపై ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల స్పందిస్తూ రాజమౌళితోపాటు ఈ సినిమా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.ఇకపోతే ఈ ఆస్కార్ నామినేషన్ గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ కి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Keeravani, Natu Natu, Oscar, Oscars, Rajamouli, Taman, Trivikram-Movie

ఇప్పటివరకు ఏ ఇండియన్ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలకు ఇలాంటి ఘనత దొరకలేదు అయితే ఈ విషయంపై తమన్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తమను ఆస్కార్ వరకు తీసుకువెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే తమన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నమ్మకం ఉండడంతో తనని ఆస్కార్ వరకు తీసుకువెళ్తారని నమ్మకం ఉండటం పరవాలేదు కానీ తమన్ ఎందుకు రియాలిటీగా ఆలోచించలేకపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.

త్రివిక్రమ్ సినిమాల కథలు ఎప్పుడూ కూడా కొత్తగా ఉండవు.అక్కడో ఇక్కడో లేపేసిన కథలకు తనదైన కథనాన్ని అందించే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఆస్కార్ నామినేషన్ వరకు ఎలా వెళ్తాయి అంటూ నేటిజన్స్ తమన్ వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube